మణిపూర్‌లో రూ.1800లకు వంట గ్యాస్ ధర..
TGWNEWS/మణిపూర్: మణిపూర్‌లో రూ.1800లకు వంట గ్యాస్ ధర చేరింది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నిఅంటింది. రిజర్వేషన్ల విషయంలో రేగిన వివాదం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మూడు వారాల నుంచి ఉద్రిక్తత నెలకొంది. ఇతర రాష్ట్రాల నుంచి మణిపూర్‌కు ట్రక్కులు నడిపేందుకు యజమానులు, డ్రైవర్లు ముందుకు రాకపోవడంతో నిత్యావసర వస్తువులకు రాష్ట్రంలో కొరత ఏర్పడింది. అందుబాటులో ఉన్న సరుకుల ధరలను వ్యాపారులు విపరీతంగా పెంచేశారు. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో సిలిండర్ ధర రూ.1800లకు పైకి చేరిందని ప్రజలందరూ ఆందోళన వెక్తం చేసారు.


0 Comments