🔴
Loading latest posts...
Showing posts with label Telangana. Show all posts
Showing posts with label Telangana. Show all posts

Monday, May 11, 2026

రేపు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు...

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 12న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, మండలి, శాసనసభాపక్ష ఉపనాయకులతో సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్‌చార్జిల నియామకం, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నట్లు సమాచారం. రానున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ వ్యూహాలపై కూడా చర్చలు జరిగే అవకాశముంది.

రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు...

రానున్న 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు...

 తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగుతున్నప్పటికీ మరోవైపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో పలుజిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండొచ్చని పేర్కొంది. రాజధాని హైదరాబాద్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Thursday, May 7, 2026

ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు బ్రేక్??? 10+2 విధానం??

నూతన విద్యా సంవత్సరం--చిక్కుముడులు...

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యాశాఖను ఇంటర్మీడియట్ విద్యాశాఖను మిళితం చేసి టెన్ ప్లస్ టు విద్యా విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి విధానం లేనట్టుగా కనిపిస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా పాఠశాలల్లో, తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అధ్యాపకులు ఎవరు ఉంటారు అనేదానిపై స్పష్టత లేదు. వీరిని కొత్తగా నియమిస్తారా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను తీసుకుంటారా అనే అంశాన్ని స్పష్టం చేయవలసి ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసినట్లయితే వీరికి ఎవరు విద్యాబోధన చేయాలి అనే దానిపై స్పష్టత లేదు ఎందుకంటే పాఠశాల విద్యాశాఖలో ఒకటి నుంచి 10వ తరగతి చెప్పేందుకు మాత్రమే ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం జరిగింది. ఇంటర్మీడియట్ బోధించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ జూనియర్ లెక్చరర్ నియామకాలను టీఎస్పీఎస్సీ ద్వారా చేపట్టింది.  ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యా శాఖలో విలీనం చేసినట్లయితే 11వ తరగతి 12వ తరగతి విద్యార్థులకు ఎవరు బోధన చేయాలి అనే అంశంపై చిక్కుముడి ఉంది దీనికి సర్వీస్ రూల్స్ అడ్డంకిగా ఉన్నాయి దీనిపై స్పష్టత లేకుండానే ముఖ్యమంత్రి ప్రకటన ఇచ్చాడని స్పష్టంగా తెలుస్తుంది..ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం పాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది జూనియర్ కళాశాల విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం అందించడానికి కూడా సిద్ధమైంది. విద్యార్థుల ఆకలి తీర్చడం ప్రభుత్వ బాధ్యతే అయినా ప్రస్తుత బడుల్లో అధ్యాపకులు పాఠాలు చెప్పడం కంటే విద్యార్థుల భోజనానికే ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం, అల్పాహారం, పాలు వంటి విధులు  అధ్యాపకులకు కాకుండా  వేరే శాఖకు గాని స్వచ్ఛంద సంస్థ లకు గానీ ప్రభుత్వం కేటాయిస్తే పాఠశాల ల్లో బోధన మెరుగుపడుతుందని మేధావుల అభిప్రాయం.

రోజురోజుకీ సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉన్నది రాష్ట్రంలో 57 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఉన్నతీకరించనున్నామని ప్రభుత్వం చెబుతోంది. వీనిలో 15 కొత్త కోర్సులను కూడా ప్రవేశపెడతామని ప్రభుత్వం తెలిపింది ఈ ఏటీసీ సెంటర్లలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా కోర్సులను ప్రవేశపెట్టాలి, వీటిలో చదివిన విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతిక నిపుణులుగా ఎదగాలి..ఇటీవల ఆకునూరు మురళి గారి నేతృత్వంలో తెలంగాణ నూతన విద్యా విధానం ముసాయిదా కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ కమిటీ నూతన విద్యా విధానానికి బదులుగా టీచర్ల జీతాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. టీచర్లకు ఎక్కువ జీతాలు ఉన్నాయన్నడం ఈ కమిటీ అపరిపక్వతను తమ బాధ్యతారహిత్యాన్ని బట్టబయలు చేసుకున్నట్లయింది.  నిజానికి తెలంగాణలో విద్యుత్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మరియు అనేక ఇతర శాఖలో టీచర్ల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్న వారు ఉన్నారు. వీరిలో స్వీపర్, అటెండర్లు కూడా టీచర్ల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్నవారు ఉన్నారు. వీటన్నిటిని విస్మరించి ప్రభుత్వ టీచేర్లే ఎక్కువ జీతాలు పొందుతున్నారు అని ప్రచారం చేయడం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు గాను ప్రజలలో ప్రభుత్వ టీచర్లను చులకన చేయడంలో భాగంగా చూడవచ్చు. ఒక కుక్కను చంపేందుకు దానిని పిచ్చికుక్కగా ప్రచారం చేసినట్లుగా ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసేందుకు గాను ప్రభుత్వ టీచర్లను  ఈ విధంగా బధనాం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో టీచర్లకు పాఠాలు చెప్పే విధుల కంటే రిపోర్టులు పంపే విధులే ఎక్కువగా ఉన్నాయి ఫలితంగా ప్రభుత్వ బడులలో చదువు ఆటకెక్కుతుంది.పాఠశాలలో మౌలిక వసతులను కల్పించకుండా చేపట్టే ఏ చర్యలైనా నిష్ఫలమే.

నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు ఈ భావి భారత పౌరులను తీర్చిదిద్దే పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, సమాజం పైన ఉన్నది. ప్రభుత్వం తన నూతన విద్యా విధానాన్ని మరొకసారి పునసమీక్షించి  విద్యావేత్తల నుంచి మేధావుల నుంచి మరొకసారి అభిప్రాయాలను తీసుకోవాలి ఆ తర్వాతే నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలి లేనట్లయితే గత ప్రభుత్వం మాదిరే ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ బడులు నిర్వీర్యం చేసి  ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించినట్లే అవుతుంది, అదేవిధంగా ప్రభుత్వ కేటాయింపులు నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా వృధా అవుతాయి.

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...