🔴
Loading latest posts...
Showing posts with label Warangal. Show all posts
Showing posts with label Warangal. Show all posts

Thursday, May 7, 2026

ఆలయాన్ని విధ్వంసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలీ : అనిల్ కుమార్ నాయక్...

ఆలయాన్ని విధ్వంసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలీ : 

ఖానాపురం అశోక్ నగర్ గ్రామంలో విధ్వంసమైన కాకతీలు నాటి చారిత్రక ఆలయాన్ని పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు డా||బోడా అనిల్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూతక్షణమే స్థానిక గౌరవ ఎమ్మెల్యే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాముఎమ్మెల్యే,కలెక్టర్,ప్రభుత్వo స్పందించి ఆలయ పునర్ నిర్మాణం చేసే విధంగా పాటుపడాలి లేనిచో రాష్ట్రవ్యాప్త ఆందోళనకి దిగుతాముచారిత్రక ఆలయాన్ని విధ్వంసం చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలీఆలయ కూల్చివేతపైన ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నవిప్రజల మనోభావాలు దెబ్బతినేవిధంగా ఆలయ విధ్వంసం జరిగిందిచరిత్రహీనులు మాత్రమే ఈ లాంటి పనులు చేస్తారుకాకతీయుల చరిత్ర పైన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది కాకతీయుల కళాతోరణాన్ని తొలగించాలని ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు నేడు కాకతీయులు కట్టిన చారిత్రక ఆలయాన్ని తొలగించారుఅభివృద్ధి పేరుతో చారిత్రక ఆలయాన్ని విధ్వంసం చేయడం అవివేకం  కాకతీయుల చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతానికి వేల సంవత్సర చారిత్రక  గుర్తింపును ఇచ్చింది. పాకాల సరస్సు కలిగిన చారిత్రక ప్రాంతంలో ఆలయాన్ని ఈరోజు విద్వంసం చేశారు. 1213 సంవత్సరంలో నిర్మించిన పురాతనమైన కాకతీయ కళ సంపద కలిగిన ఆలయాన్ని కూల్చి వేస్తుంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారు.ఈ ఆలయాన్ని అనేక ప్రభుత్వాలు గుర్తించినవి , గతంలో ఈ స్థలాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించాలని ఉన్న చారిత్రక ఆలయం ఉన్నందున ఉపయోగించలేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో అనుమతులు ఇవ్వడానికి ఎలాంటి అధికారాలు లేవు.కాంట్రాక్టర్ లాభాల కోసం స్థానిక నాయకుల కమిషన్ల కోసం చరిత్ర కలిగిన ప్రాంతాన్ని విధ్వంసం చేయవద్దు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వెంటనే దీనిపైన విచారణ చేపట్టాలి ఈ ఆలయం నుండి ఖిల్లా వరంగల్ వరకు  సోరంగా మార్గాలు ఉండేవని చరిత్ర చెబుతున్నది బాధ్యుల పైన తక్షణ చర్యలు తీసుకోవాలి ,వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నర్సంపేట నాయకులు వినోద్ మహేందర్ కిరణ్ నరేష్ బన్నీ నరసింహ మంగ్య మహేష్ అభిరామ్ రాజేష్ తేజు జంపన్న నిమ్మల రమేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిరోదిద్దాం : పెండెం శ్రీలక్ష్మీ రామానంద్..

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిరోదిద్దాం...

నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం నందు ASR సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్  ఆధ్వర్యంలోనర్సంపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్లాస్టిక్ వాడకం నిషేధం పై ఫంక్షన్ హాల్స్ మరియు హోటల్స్,టిఫిన్ సెంటర్స్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామనంద్ ,మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్  మాట్లాడుతూసింగిల్ యూజ్ వస్తువులైన ప్లాస్టిక్ కప్పులు,గ్లాసులు,స్పూన్లు,ప్లేట్లు, స్ట్రాలు,మరియు120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న క్యారీ బ్యాగులను హోటళ్లలో వాడకూడదని అన్నారు ప్లాస్టిక్ భూమిలో కరగడానికి వందల ఏళ్లు పడుతుందని,ఇది భూగర్భ జలాలను కలుషితం చేయడమే కాకుండా మనం ఆహారంతో కూడిన ప్లాస్టిక్ కవర్లను బయటపడేయడం ద్వారా పశువులు ఆహారంతో పాటు ప్లాస్టిక్ కవర్లను కూడా తినడం ద్వారా వాటి ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతోందని తెలిపారు ప్లాస్టిక్ వస్తువులలో వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అన్నారు.కావున ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని..ప్లాస్టిక్‌ను నిషేధించి,మన ఆరోగ్యాన్ని మరియు ప్రకృతిని రక్షించుకుందాం అన్నారు. 15 రోజుల్లోగా హోటల్స్,టిఫిన్,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిషేధించాలని యజమానులను కోరారు.. లేనియెడల నిషేధిత ప్లాస్టిక్ వాడితే జరిమానాలు విధిస్తామని అన్నారు.. ఫంక్షన్ హాల్స్ నందు భోజన సమయంలో పేపర్ ప్లేట్స్ బదులుగా తాటి,అరటి ఆకు ప్లేట్లను వినియోగించే విధంగా యజమానులు శుభకార్యాలు చేసుకునే వారికి అవగాహన కల్పించాలని కోరారు..  ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం అని పిలుపునిచ్చారుఅనంతరం మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్  మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లలో వేడివేడి ఆహారాన్ని తిని,అనారోగ్య భారిన పడవద్దని అన్నారు.ప్లాస్టిక్ కవర్స్ బదులుగా ప్రత్యన్మయ ఏర్పాట్లు చేయడం జరిగిందినీ హోటల్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించే బయో కవర్లు ఉపయోగించాలని కోరారు.ఇలాంటి సమాజానికి ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ASR స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్ గారిని మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్  కృతజ్ఞతలు తెలియజేశారుఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రామకృష్ణ,కౌన్సిలర్ పొన్నాల మనిషా ప్రకాష్,ఫంక్షన్ హాల్,హోటల్స్,టిఫిన్ & ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానులు,ప్లాస్టిక్ షాప్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

మే 10న బీజేపీ భారీ బహిరంగ సభ విజయవంతం చేయండి : గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

మే 10న బీజేపీ భారీ బహిరంగ సభ విజయవంతం చేయండి.

నర్సంపేట బీజేపీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి  మాట్లాడుతూ.తెలంగాణలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  మే 10, 2026న పర్యటించనున్నారని,ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 3:00 గంటలకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు, దక్షిణాది రాష్ట్రాలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకే ఈ సభ. పార్లమెంట్‌లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లుకు వ్యతిరేకంగా పనిచేసిన కాంగ్రెస్ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసి, రైతులను, మహిళలను, నిరుద్యోగులను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది.తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని, బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని చాటిచెప్పేందుకే ఈ సభ. ప్రధాని మోదీ గారితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు పాల్గొంటారని కాబట్టి నర్సంపేట నియోజకవర్గం నుండి మహిళలు, యువత, రైతులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు భారీగా తరలివచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి నరసింహ రాములు గారు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ గారు, ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు  గారు, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచంద్రారెడ్డి గారు, నియోజకవర్గం బిజెపి  నాయకులు జూలూరి మనీష్ గౌడ్ గారు, వనపర్తి మల్లయ్య గారు, కోమల్ రెడ్డి  పాలడుగుల జీవన్  నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ గారు, నల్లబెల్లి మండల అధ్యక్షులు తడక వినయ్ గారు, నర్సంపేట రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ గారు, దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్ గారు, ఖానాపూర్ మండల అధ్యక్షులు రాదారపు అశోక్ గారు, చెన్నారావుపేట మండలం అధ్యక్షులు శేఖర్  జిల్లా కౌన్సిల్ సభ్యులు దుంక దువ్వ  రంజిత్ గారు, మాజీ MPTC భాషా బోయిన రాజు  బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ గారు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొంకిసా విగ్నేష్ గౌడ్ గారు  మహిళా నాయకురాలు వసంతకుమారి గారు   వివిధ మండలాల ప్రధాన కార్యదర్శిలు ఉపాధ్యక్షులు, యువ మోర్చా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Tuesday, May 5, 2026

వరంగల్ లో కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : శ్రీకాంత్ గౌడ్

వరంగల్ లో కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : శ్రీకాంత్ గౌడ్ 



తెలంగాణ రక్షణ సేన TRS వరంగల్ రాష్ట్ర నాయకుల పత్రిక సమావేశం పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ సందర్బంగా TRS రాష్ట్ర నాయకులు డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రైతు సభ పేరుతో రేపు వరంగల్ రానునడదాన్ని తీవ్రంగా ఖండించారు పదేళ్ళు అధికారాన్ని అప్పజెప్పితే కనీసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో దేవాదుల పనులను కనీసం పూర్తి చేయలేని అసమర్ధత BRS పార్టీ దని విమర్శించారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా డెడికెట్ చేసారా అని దుయ్య బట్టారు. లక్ష ఏనబై తొమ్మిది వేల కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టిన మీరు ఉద్యమనికి ఊపిరిగా నిలిచినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీడు భూములను తడపడానికి ఎంత ఖర్చు చేసారో KTR గారు చెప్పాలని డిమాండ్ చేసారు. .నర్సంపేట మానుకోట మధ్యలో మిర్చి ప్రాసెసింగ్ యూనిట్ పెడతాం అని స్వయంగా ప్రకటించిన KTR గారు ఆది ఎక్కడ నిలకొల్పారో చూపెట్టాలి అన్నారు  KTR కు IT తెలుసు సూటు బూటు లీడర్ ఆయనకు అగ్రికల్చర్ ఎం తెలుసు అని ఏద్దేవా చేసారు  ఈ కార్యక్రమం లో హన్మకొండ జిల్లా అధ్యక్షులు పర్లపల్లి శ్రీశైలం, బిర్లా విద్యాసంస్థల చైర్మన్ నడిగూడ వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాది రాధా కృష్ణ గారు లలిత కుమారి గారు, జన్ను సంతోష్, బొచ్చు రాజు బుర్ర సాయి తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ రాజకీయాల్లో వేడి: ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు

తెలంగాణ రాజకీయాల్లో వేడి: ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు... 

హైదరాబాద్: మే 5 : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు సంగ్రామ సదస్సు మరియు అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన “కిసాన్ మేళా” కార్యక్రమాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో రైతు సంగ్రామ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన పార్టీ జెండాలు, తోరణాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) సిబ్బంది తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ ప్రేరిత చర్యగా భావిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.ఇక ప్రధాన రాజకీయ చర్చకు కారణమైన అంశం మే 6న జరుగుతున్న సమాంతర కార్యక్రమాలు. అదే రోజున బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు జరుగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం “కిసాన్ మేళా” నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఒకే రోజున రెండు ప్రధాన రాజకీయ కార్యక్రమాలు జరగడం యాదృచ్ఛికమా లేదా వ్యూహాత్మక రాజకీయ కౌంటర్ ప్లాన్‌లో భాగమా అన్న అంశంపై చర్చ కొనసాగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాలు దీనిని తమ సభ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంగా అభివర్ణిస్తుండగా, కాంగ్రెస్ వర్గాలు మాత్రం రైతుల సంక్షేమం కోసం చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు రాజకీయ రంగు అద్దడం సరికాదని అంటున్నాయి. ఇదే తరహా పరిణామాలు గతంలోనూ చోటుచేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇటీవల జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జరుగుతున్న సమయంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహించడంపై కూడా అప్పట్లో చర్చ జరిగింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో సభల సమన్వయం, సమాంతర కార్యక్రమాల వ్యూహాలపై కొత్త చర్చ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల చర్యలు ప్రజల దృష్టిని ప్రభావితం చేసేలా ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి, రైతు సభల చుట్టూ రాజకీయ ఉష్ణోగ్రత మరింత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...