🔴
Loading latest posts...
Showing posts with label Andhrapradesh. Show all posts
Showing posts with label Andhrapradesh. Show all posts

Thursday, May 14, 2026

రాజకీయాలకు బొత్స గుడ్ బై...

రాజకీయాలకు బొత్స గుడ్ బై...

AP: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయాలకు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత ఎన్నికల తర్వాత అనారోగ్యానికి గురైన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కుప్పకూలిపోయారు. ఈ నేపథ్యంలో, ఆయన శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పదవి నుంచి తప్పుకుంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీనిపై సీనియర్లతోచర్చించనున్నారని సమాచారం.

Saturday, May 9, 2026

బాలికపై పాస్టర్ అత్యాచారం...

 బాలికపై పాస్టర్ అత్యాచారం...

ఏలూరు గుడివాడ:ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరింపు.కామవరపుకోట ఓ చర్చి పాస్టర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నెలసరి తప్పడంతో గర్భనిరోధక మాత్రలు వేశాడు. తీవ్ర రక్తస్రావంతో బాలిక అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం బాధ్యతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు . బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కామవరపుకోట మండలం.కళ్ళచెరువుకు చెందిన పాస్టర్ చౌటపల్లి రాంబాబు చర్చి ఏర్పాటు చేసుకొని ప్రార్థనలను నిర్వహించేవాడు ఈ క్రమంలో కూలి పనులు చేసుకునే ఓ కుటుంబం ఆయన వద్దకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేవారు. వారి కుమార్తె (14) పై కన్నేసిన పాస్టర్ తరచూ ఆమెపై అత్యాచారం చేస్తూ ఎవరికైనా చెబితే దేవుడు శపిస్తాడని బెదిరించేవాడు. దీంతో ఆ బాలిక ఎవరికి చెప్పలేదు. ఈ నేపథ్యంలో బాలిక నెలసరి రాకపోవడంతో గర్భనిరోధక మాత్రలు అధిక మోతాదులో పాస్టర్ వాడించాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో బాధపడుతూ తల్లికి జరిగిన విషయం చెప్పింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆధ్యాత్మిక ప్రార్థనల పేరుతో అభం శుభం తెలియని బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్ కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 

తడికలపూడి ఎస్సై వల్లి పద్మ కేసు నమోదు చేశారు

వర్షాలు ఎక్కెడెక్కడ పడనున్నాయో తెలుసా.... ?

వర్షాలు ఎక్కెడెక్కడ పడనున్నాయో తెలుసా.... ?

శ్రీలంక మీదుగా ఉన్న ఆవర్తనం రానున్న 72 గంటల్లో అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో మన రాష్ట్ర కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాలలో తెల్లవారుజామున వర్షాలు పడే అవకాశం ఉంది. అదే విదంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో ఉత్తరాంధ్రలోని వైజాగ్ మరియు మధ్య ఆంధ్రలోని విజయవాడ-గోదావరి ప్రాంతాలలో ఈ రోజు, రేపు వర్షాలు తగ్గి సోమవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది.




Wednesday, May 6, 2026

గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్త రైలు

గుంతకల్లు, గిద్దలూరు, మార్కాపురం రోడ్డు మధ్య కొత్త రైలు

ఈనెల 13వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుంతకల్లు, మార్కాపురం రోడ్డు  రైల్వే స్టేషన్ మార్గాల మధ్య ప్రతిరోజు  ప్యాసింజర్ రైలు నడిపేందుకు సిద్ధమయింది. 57407/ 57408 నంబర్ తో నడిచే ఈ రైలు గుంతకల్లు, మద్దికేర, పెండేకల్లు, డోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లి, జగ్గంబట్ల కృష్ణాపురం, కంభ, తర్లుపాడు రైల్వే స్టేషన్లలో ఆగుతూ మార్కాపురం రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ప్రతిరోజు గుంతకల్లులో సాయంత్రం 5:30 కి  బయలుదేరి రాత్రి 11:30 కి మార్కాపురం చేరుకుంటుంది. మార్కాపురం రోడ్డులో ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 నిమిషాలకు బయలుదేరి ఉదయం 10: 30 నిమిషాలకు గుంతకల్లు చేరుతుంది.

Tuesday, May 5, 2026

సాకారమైన కల..విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ విడుదల..!

సాకారమైన కల..విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుపై గెజిట్ విడుదల..!

కేంద్ర ప్రభుత్వం 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్' (SCoR) ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది..విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా జూన్ 1 నుండి జోన్ అధికారికంగా అమలులోకి వస్తుంది.. జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు మరియు కొత్త విశాఖ రైల్వే డివిజన్లు ఉంటాయి.. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరియు ప్రాంతీయ వృద్ధికి ఇది గొప్ప ముందడుగుగా భావిస్తున్న ఏపీ ప్రభుత్వం..!

రంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ...

రంగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ...

TGWNEWS : మార్కాపురం జిల్లా రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన రంగారెడ్డి (రిటైర్డ్ టీచర్)కుటుంబాన్ని మంగళవారం వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి  పరామర్శించారు.ఇటీవల అనారోగ్యంతో రంగారెడ్డి సతీమణి రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతోపాటు రాములమ్మ మృతికి ప్రవీణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు.

డయల్ 112 కాల్‌తో నలుగురి ప్రాణాలు రక్షణ..

డయల్ 112 కాల్‌తో నలుగురి ప్రాణాలు రక్షణ..

భర్త వేధింపులతో పిల్లలతో కలిసి ఆత్మహత్యకు వెళ్లిన మహిళ..రైలు కిందపడి చనిపోవాలని ప్రయత్నించిన తల్లి, ముగ్గురు పిల్లలు..డయల్ 112కు సమాచారం అందగానే అప్రమత్తమైన పోలీసులు..కేవలం 10 నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకున్న బ్లూ కోల్ట్ సిబ్బంది..ట్రాక్‌పై ఉన్న మహిళ, ముగ్గురు చిన్నారులను సురక్షితంగా కాపాడిన పోలీసులు.. కానిస్టేబుళ్లు సుబ్బారాయుడు, రాజీవ్ కుమార్ సమయస్ఫూర్తికి ప్రశంసలు.. కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించిన పోలీసులు..స్పందించిన బ్లూ కోల్ట్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్.. క్షణికావేశంలో ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసుల సూచన..

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు








ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయాలి

మొహమాటాలకు పోతే ఎక్కువ కాలం ఉండలేం

ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు రీచెక్ ఉండాలి-చంద్రబాబు

అధికారులు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండలి

అధికారుల పనితీరు కూడా గమనిస్తున్నాం-చంద్రబాబు

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...