🔴
Loading latest posts...
Showing posts with label Hyderabad. Show all posts
Showing posts with label Hyderabad. Show all posts

Tuesday, May 12, 2026

బండి భగీరథ్ పైన తక్షణమే విచారణ జరపాలి : సీఎం రేవంత్..

బండి భగీరథ్ పైన తక్షణమే విచారణ జరపాలి : సీఎం రేవంత్.. 

బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన  నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు. 8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కి డీజీపీ వివరించారు.కేసు స‌మ‌గ్ర‌ విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు..

Monday, May 11, 2026

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు ..

బండి భగీరథ్ కేసుపై సిట్ ఏర్పాటు ..

హైదరాబాద్, మే 11: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని దర్యాప్తును మహిళా ఐపీఎస్ అధికారిణి పర్యవేక్షణలో నిర్వహించాలని డీజీపీ నిర్ణయించినట్లు సమాచారం. బాధితురాలు బాలిక కావడం, కేసులో ఉన్న ఆరోపణల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని విచారణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటికే సిట్ బృందం కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. బాధిత బాలిక స్టేట్మెంట్‌ను చట్టపరమైన నిబంధనల ప్రకారం పోలీసులు నమోదు చేశారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని కీలక విషయాలను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలించే అవకాశముందని సమాచారం. కేసులో ఉన్న ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా విచారించి నిజానిజాలు వెలికితీసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Tuesday, May 5, 2026

మక్తల్‌లో జింకల వేట ముఠా అరెస్ట్

మక్తల్‌లో జింకల వేట ముఠా అరెస్ట్



జింకల వేటకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, నిందితుల నుండి ఒక రైఫిల్, మూడు ఎయిర్ గన్స్‌ను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 

అరెస్టైన వారిలో ఇద్దరు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, మరొకరు మహబూబ్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తింపు

ఇప్పటివరకు నిందితులు 12 జింకలు, 4 నెమళ్లను వేటాడి వాటి మాంసాన్ని వినియోగించినట్లు గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

ప్రభాస్ ఫౌజీ మూవీ నిర్మాణ బృందంలో విషాదం..!

 ప్రభాస్ ఫౌజీ మూవీ నిర్మాణ బృందంలో విషాదం..!



ఈరోజు షూటింగ్ కోసం వెళ్తుండగా ప్రమాదం..!

అబ్దుల్లాపూర్ మెట్ వద్ద  ప్రమాదం...! అదుపుతప్పిన వాహనం డివైడర్ సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టినట్లు సమాచారం..!

ఘటనలో ఒకరు మృతి..మరో ఐదుగురుకి తీవ్ర గాయాలు..!

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలింపు..

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు...

ఎస్సై సైదిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు... నేరేడుచర్లలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సైదిరెడ్డి గారిని బూర్గులతండా కాంగ్రెస్ గ్రామ...