అయ్యో పాపం.. తండ్రి ఆత్మహత్యను సెల్ ఫోన్ లో వీడియో తీసిన నాలుగేళ్ళ కొడుకు..

తండ్రి ఆత్మహత్యను సెల్ ఫోన్ లో వీడియో తీసిన నాలుగేళ్ళ కొడుకు..

TGWNEWS/కడప : తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంటుండ‌గా త‌న నాలుగేళ్ల కొడుకు ఆ ఘ‌ట‌న‌ను మొబైల్ ఫోన్ లో రికార్డు చేసిన షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. కడప నగరంలోని చిలకలబావి ప్రాంతంలో జరిగిన ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం మృతుడు తీవ్ర మనస్థాపంతో బాధపడుతున్నాడని ఈ క్రమంలోనే తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే, ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ను అత‌ని చిన్న కొడుకు మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకలబావి ప్రాంతానికి చెందిన షేక్ జమాల్ వలి టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతని భార్య అరిఫున్ కువైట్‌లో ఉద్యోగం చేస్తోంది. దీంతో అతని ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకుతో క‌లిసి నివసిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా జమాల్ తీవ్ర మనస్తాపం, గందరగోళ జీవితాన్ని గడుపుతున్నాడని చెప్పారు. ఒక సంవత్సరం క్రితం అతని తండ్రి మదార్ సాహెబ్ మరణంతో అతడు మరింత నిరాశకు గురైనట్టుగా తెలిసింది. ఈ క్ర‌మంలోనే మనోవేదనతో ఉంటున్న జమాల్‌… తన నాలుగేళ్ల కొడుకును వారి ఇంటి పై అంతస్తుకు తీసుకెళ్లి, అతని ఆత్మ‌హ‌త్య‌ను వీడియో తీయమని కోరాడు. అభం శుభం తెలియని కొడుకు కళ్లముందే బల వన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం వీడియో బయటకు రావడంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కెమెరాను పట్టుకుని వీడియో తీస్తున్న బాలుడు బిగ్గరగా ఏడవ‌డం కూడా అందులో వినిపించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసులో కీలకంగా మారిన వీడియోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments