బోడ ఎల్లయ్యకు దళిత రత్న అవార్డు ప్రధానం చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్..

బోడ ఎల్లయ్యకు దళిత రత్న అవార్డు ప్రధానం చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

TGWNEWS/మహబూబాబాద్: గూడూరు మండల కేంద్రానికి చెందిన బోడ ఎల్లయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డును ప్రధానం చేసింది. పలు సామాజిక కార్యక్రమంలో తన వంతు పాత్రను పోషిస్తూ కరోనా కాలం నందు చనిపోయిన  పేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు సరఫరా చేస్తూ, ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా ఈ అవార్డును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  ఈ సందర్భంగా  మానుకోట  ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్  చేతుల మీదుగా  బోడ ఎల్లయ్య దళిత రత్న అవార్డు గ్రహీత అందుకున్నారు.

Post a Comment

0 Comments