TGW న్యూస్ ఎఫెక్ట్ : కొత్త విద్యుత్ స్తంభాలు అమర్చిన అధికారులు....

TGW న్యూస్ ఎఫెక్ట్ : కొత్త విద్యుత్ స్తంభాలు అమర్చిన అధికారులు....

TGWNEWS/వరంగల్:  జిల్లాలోని ఖిలా వరంగల్ దగ్గరలో గల తూర్పు కోట వద్ద  ఇటీవల గాలి వాన బీభత్సం సృష్టించడంతో విద్యుత్ స్తంభాలు రోడ్డు మీద తెగి పడ్డాయి. కాగా విద్యుత్ స్తంభాలు విరిగి   మూడు రోజులు గడిచినా  అధికారులు పట్టించుకోక పోవడంతో రైతులు  TGW NEWSతో తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులును TGW న్యూస్ ప్రశ్నించడంతో వెంటనే స్పందించిన AE తరుణ్   నూతన స్తంభాలు ఏర్పరిచేలా చర్యలు తీసుకున్నారు.  ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ TGW న్యూస్ వల్లనే తమకు విద్యుత్ సరఫరా తొందరగా అందిందని కొనియాడారు.

Post a Comment

0 Comments