ఛలో ఖమ్మం, బీజేపీ భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం : ఎర్రబెల్లి ప్రదీప్ రావు
TGWNEWS/వరంగల్ : ఈనెల 15వ తేదీన ఖమ్మం జిల్లా లో నిర్వహించబోయే బీజేపీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు కోరారు. మంగళవారం డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, నర్సింహుల పేట, చిన్న గూడూరు మండలాలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ పార్లమెంటు సభ్యులు చాడ సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఖమ్మం జిల్లా లో నిర్వహించబోయే బీజేపీ భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హోం శాఖ మంత్రి అమీషా హాజరుకానున్నారని, కావున ఈ బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు.


0 Comments