సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కేసీఆర్..

సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు కేసీఆర్..

TGWNEWS/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం  వచ్చిన తర్వాతే సింగరేణి  కార్మికులకు గొప్ప ఫలితాలు అందుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె  మీడియాతో మాట్లాడుతూ అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా అనేక మంది ప్రయత్నాలు చేసినా, సీఎం కేసీఆర్ పట్టుదలతో వారసత్వ ఉద్యోగాలు అందిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. సింగరేణి సంస్థను కాపాడుతున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ  కవిత మరొకసారి వ్యాఖ్యానించారు.


Post a Comment

0 Comments