హైదరాబాద్‌లోని ఈ మూడు మెట్రో స్టేషన్లకు పేరు మార్పు..

హైదరాబాద్‌లోని ఈ మూడు మెట్రో స్టేషన్లకు పేరు మార్పు..

TGWNEWS/హైదరాబాద్ : నగరంలోని మరో మూడు మెట్రో స్టేషన్లకు అదనపు పదాలు జోడిస్తూ పేర్లు మార్చారు. ఈ మేరకు లక్డీకాపూల్‌కు ఎన్‌ఎండీసీ అని, బేగంపేట్‌, హైటెక్‌సిటీ స్టేషన్లకు ఎస్‌బీఐ అని  బోర్డులు ఏర్పాటు చేశారు. సంస్థ కార్యకలాపాలను అభివృద్ధి చేస్తూ నష్టాలను తగ్గించు కోవడంలో భాగంగా ఎల్‌అండ్‌టీ స్టేషన్ల పేర్లను టెండర్ల ప్రాతిపదికన వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రకటనలకు అవకాశం కల్పిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కాగా స్టేషన్ల పేర్ల మార్పునకు సంబంధించి ఈ నెల 5న అధికారికంగా తెలియజేయనున్నట్లు తెలిసింది.

Post a Comment

0 Comments