తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడులు...

తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడులు...

TGWNEWS /జాతీయం :నిజామాబాద్ : నిజామాబాద్ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు  నిర్వహించారు. యూనివర్సిటీలో గత కొంత కాలంగా అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. యూనివర్సిటీలో ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని ఈసీ చర్యలకు దిగింది. వీసీ రవీందర్ గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్‌ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్‌ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీలో పాలన గందరగోళంగా మారింది. ఈసీ సభ్యులకు, వీసీకి మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ దాడులతో మరోసారి కలకలం చెలరేగింది......

Post a Comment

0 Comments