గ్యాస్ లీక్ తో ఎగిసిపడ్డ మంటలు...


 గ్యాస్ లీక్ తో ఎగిసిపడ్డ మంటలు...

TGWNEWS/ఆంధ్రప్రదేశ్ : కోనసీమ జిల్లా రాజోలు మండలం  ఓఎన్జీసీ గ్యాస్‌ లీక్‌ బీఆర్‌ అంబేద్కర్‌  శివకోడులో రొయ్యల చెరువులకు నీళ్లు కోసం తవ్విన బోరుబావి నుంచి ఓఎన్జీసీ గ్యాస్‌ బయటకు వస్తుంది..గ్యాస్ లీక్‌తో మంటలు ఉద్ధృతంగా ఎగిసిపడుతున్నాయి. దీంతో స్థానికులు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు(ఓఎన్జీసీ) సమాచారం ఇచ్చారు.సంఘటనా స్థలానికి చేరుకున్న ఓఎన్జీసీ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలలను ఆర్పడంతోపాటు బోరుబావిలోంచి గ్యాస్ రావడానికి గల కారణాలు పరిశీలిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి మూడు వైపులా మూసేసిన ఓఎన్జీసీ ఆన్ షోర్ బావులు ఉన్నాయి. అయితే నివాస స్థలాలకు దూరంగా ఉండటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు..

Post a Comment

0 Comments