ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ సమీపంలో నగ్న నిరసనలు...

 ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ సమీపంలో నగ్న నిరసనలు...

TGWNEWS/జాతీయం: ఛత్తీస్‌గడ్‌లో కొందరు నగ్నంగా నిరసనలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్ల బెడద ఉన్నదని, ఈ నకిలీ సర్టిఫికేట్లతోనూ పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని వారు ఆరోపిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఈ బెడదను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రాయ్‌పూర్ఛ,త్తీస్‌గడ్‌లో షాకింగ్ రీతిలో కొందరు నిరసనలు చేస్తున్నారు. ఒంటిపై నూలు పోగు లేకుండా రోడ్డెక్కి ప్రదర్శనలు చేస్తున్నారు. అసెంబ్లీ సమీపంలో గుంపులుగా వారు నగ్నంగా నిరసనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్ల చీడ ఉన్నదని, దాన్ని అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ సర్టిఫికేట్లు పెట్టి ప్రభుత్వ ఉద్యోగం పొందినట్టుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇందుకు సంబంధించి చేతిలో ప్లకార్డులు పట్టుకుని వారు రోడ్లపై నగ్నంగా ప్రదర్శనలు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. ఈ వీడియోలతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఛత్తీస్‌గడ్‌లో నకిలీ కుల సర్టిఫికేట్లకు వ్యతిరేకంగా నిరసనలు జరగడం ఇదే తొలిసారి కాదు. కానీ, ఈ తరహా నగ్నంగా ప్రజలు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేయడం మాత్రం ఇది వరకు ఎప్పుడూ జరగలేదు.ఛత్తీస్‌గడ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తమ డిమాండ్లను ఈ సందర్భంలోనే చట్టసభ్యుల దృష్టికి బలంగా తీసుకెళ్లగలమని వారు భావిస్తున్నారు. అందుకే అసెంబ్లీ సమీపంలో వారు ప్రదర్శనలు చేస్తున్నారు. అటు వైపుగా ఏ వీవీఐపీ కారు వచ్చినా దాని వైపు పరుగులు తీస్తున్నారు. వారి దృష్టికి తమ నిరసనను తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు...

Post a Comment

0 Comments