ఎమర్జెన్సీ ల్యాండింగ్ తప్పిన ప్రమాదం...

ఎమర్జెన్సీ ల్యాండింగ్  తప్పిన ప్రమాదం...




TGWNEWS/జాతీయం :ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లో రన్‌వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం ప్రమాదానికి గురైది పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది..నోస్ ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్‌ అయిన కాసేపటికే వెనక్కి తిరిగి వచ్చింది. ఈ క్రమంలో అత్యవసరంగా ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేపై ప్రమాదానికి గురైంది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది..రన్ వేపై నీరు నిలవడంతో.. ఆ నీటిలో అలాగే ముందుకు వెళ్లింది. అప్పటికే విమానం నోస్ గేర్ సరిగా లేకపోవడంతో విమానం ఒక్కసారిగా ముందుకు దొర్లింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఆ సమయంలో విమానంలో ఇద్దరు పైలెట్లు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. హాల్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అవుతున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు..

Post a Comment

0 Comments