జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్ పోస్టులకు సర్కార్ గ్నీన్‌ సిగ్నల్...

జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్ పోస్టులకు సర్కార్ గ్నీన్‌ సిగ్నల్...

TGWNEWS/హైదరాబాద్: కాలేజీల్లో 1,654 గెస్ట్‌ లెక్చరర్ పోస్టులకు సర్కార్ గ్నీన్‌ సిగ్నల్జూ నియర్‌ కాలేజీల్లో 1,654 గెస్ట్‌ లెక్చరర్ పోస్టులకు సర్కార్ గ్నీన్‌ సిగ్నల్నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది అతిథి అధ్యాపకుల (గెస్ట్‌ లెక్చరర్లు) నియామకానికి సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ మంగళవారం (జులై 18) ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన నియామక మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. జూనియర్‌ కాలేజీల్లో ప్రభుత్వం అతిథి అధ్యాపకులకు ఒక్కో పీరియడ్‌కు నిమిత్తం రూ.390 చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే నెలకు గరిష్ఠంగా 72 పీరియడ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన నెలకు రూ.28,080 చొప్పున వేతనం అందించనున్నట్లు వెల్లడించింది .జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా ఇంటర్‌ విద్యా శాఖ అధికారి, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా నియామక కమిటీ ఏర్పాటు చేస్తారు...

Post a Comment

0 Comments