వందేమాతరం వందకోట్ల ప్రజల గుండెస్వరం... 
TGW NEWS/జాతీయం : మనదిండియా. సలామ్ చేస్తుంది దునియా.నీ క్షేమమే మా జీవనం.వందేమాతరం వందకోట్ల గుండెస్వరం..మన్ను నుంచి అన్నం తీసే ఆకుపచ్చని కన్ను
దేశాన్ని బ్రతికించే వెన్నుదన్ను.సరిహద్దు కంచెపై కాపల కాసే గన్ను దేశ రక్షణలో నిలువెత్తు మిన్ను.మనదిండియా.సలామ్ చేస్తుంది దునియా.బడిగుడిలో చదువుల చిలుకలుభవిష్యత్ దారికి.బంగరు మొలకలు శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగాలు సమాజవృద్ధి సంవృద్ధి ఫలాలు.
మనదిండియా.సలామ్ చేస్తుంది దునియా.చంద్రయాన్ ప్రయాణం భారతం ప్రపంచానికి చందమామై చలువనుపంచిన పరిమళం.వందే భారత్ కోట్ల మంది స్వరం అమృత్.మన ఇంటి ఇంటిపై జెండా దేశాభివృద్ధి అజెండా.మనదిండియా..సలామ్ చేస్తుంది దునియా.మనుషుల సంద్రం దేశం.మమతల తీరం దేశం.
దేశానికి దేహమే మూలస్థానందేహానికి దేశమే ప్రథమస్థానం
దేహాల చెమటచుక్కల శ్రమనదిలోంచే దేశమైతది అగ్రస్థానం
మనదిండియా...సలామ్ చేస్తుంది దునియా...

0 Comments