కార్మికులకు ఆర్థిక సహాయం కోసం మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తాం
ప్రధాని మోదీ....
TGW NEWS/జాతీయం: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి దేశ కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద ప్రకటన చేశారు. వచ్చే విశ్వకర్మ జయంతి రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం దేశంలో ఫర్నిచర్ లేదా కలపను తయారు చేసే, సెలూన్లు నడుపుతున్న, బూట్లు తయారు చేసే, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందిస్తుంది.స్వానిధి యోజన’ ద్వారా దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు పేదరికంలో మగ్గుతున్న దేశంలోని కోట్లాది మంది కార్మికులకు కూడా ఇలాంటి సహాయాన్ని అందించాలని భావిస్తున్నట్లు అన్నారు. వీరిలో ఎక్కువ మంది ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చినవారే....

0 Comments