దేశ చరిత్రలో..రాజీవ్ గాంధీది చెరగని ముద్ర....
TGW NEWS/పరకాల: నవ భారత నిర్మాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా నడికూడ లో ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులునవ భారత నిర్మాత,భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా టీపీసీసీ సభ్యులు,పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గౌరవ శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు,అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణి చేసారు...ఈ సందర్బంగా నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ 40 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యాడు.అతని పదవీ కాలంలో,రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునీకరించడం మరియు ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు మరియు విధానాలను ప్రవేశపెట్టారు. భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి విజన్ 2020 కార్యక్రమాన్ని ప్రారంభించి, సాంకేతికత,కంప్యూటరీకరణలే రేపటి యువతకు భవిష్యత్తు అని అయన ఆనాడే చెప్పారు.దేశానికి ఎనలేని సేవలందించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి అని ఆ చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత రాజీవ్ గాంధీ దేనని,దేశ ప్రజల కోసం ప్రాణాన్ని సైతం అర్పించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని అన్నారు..ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి డా.మలహాల్ రావు,మండల బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,నడికూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్ల నవీన్,రాయపర్తి ఎంపీటీసీ పర్నెం శ్రీలత-మల్లారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పం కుమారస్వామి, మండల వైస్ ప్రెసిడెంట్ బోట్ల రవీందర్,మండల సీనియర్ నాయకులు పెద్ద బోయిన రవీందర్ యాదవ్,దుప్పటి ఎల్లయ్య,నడికూడ గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపెల్లి యుగేందర్, యూత్ అధ్యక్షులు జంగిలి శ్రీకాంత్,ప్రధానకార్యదర్శి జిల్ల శ్రీనివాస్,చౌట్ పర్తి గ్రామ అధ్యక్షులు రవి,ముస్త్యాలపల్లి గ్రామ అధ్యక్షులు బందేల దామోదర్,ముఖ్య కార్యకర్తలు దుప్పటి అనిల్,నేరెళ్ల అరుణ్, రావుల సురేష్,తాళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు...


0 Comments