జగన్‌ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది: చంద్రబాబు

 జగన్‌ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది: చంద్రబాబు...

TGW NEWS/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెడుతూ.. వైకాపా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు..

తన 45 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఇలాంటి అమానుషమైన, పనికిమాలిన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. రాజకీయ కక్ష సాధిస్తూ ఎక్కడికక్కడ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో నూటికి నూరు శాతం చిత్తుచిత్తుగా వైకాపా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు..

జగన్‌ పని అయిపోయింది. మరో ఆరు నెలల్లో ఇంటికి పోవడం ఖాయం. జగన్‌ను చూసి ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోంది. జగన్‌ను భరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరు. దేవుడు స్ర్కిప్ట్‌ తిరగరాశాడు. అదే వైకాపా పతనం. ప్రజల్లో మమేకమై వైకాపా ఆగడాలు అరికడతాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓటర్లు తెదేపా వైపే ఉన్నారు. ఇండియాటుడే c ఓటర్‌ సర్వే ప్రకారం రానున్న ఎన్నికల్లో తెదేపాకు 15 ఎంపీ స్థానాలు రావడం ఖాయం. సంక్షేమానికి కేరాఫ్‌ అడ్రస్‌గా తెలుగుదేశం పార్టీ నిలిచింది. నాలుగున్నర ఏళ్లలో ఏం నష్టపోయామో ప్రజలకు చెప్పాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలంతా మాతో కలిసి రావాలి. నిన్నిక భరించలేం.. బై బై జగన్‌ .. ఇదే అందరి నినాదం కావాలి. ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఎల్లుండి నుంచి ఆందోళనలు. జగన్‌, పెద్దిరెడ్డి, జే-గ్యాంగ్‌.. రూ.40వేల కోట్ల విలువైన ఇసుక దోచేశారు. 98శాతం హామీలు

అమలు చేశామంటూ వైకాపా చెప్పేవన్నీ అబద్ధాలే. తితిదే బోర్డు సభ్యులుగా నేరగాళ్లకు స్థానం కల్పిస్తారా? జగన్‌ మళ్లీ వస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటో ప్రజలకు వివరించాలి. బాబు భరోసా.. భవిష్యత్తుకు గ్యారెంటీ.. అనేదే మన నినాదం'' అని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు..

Post a Comment

0 Comments