కవ్వంపల్లితో కదం తొక్కుతూ.. కాంగ్రెస్ పార్టీతో కదలి వస్తామంటున్న ఇతర పార్టీల నాయకులు_

కవ్వంపల్లితో కదం తొక్కుతూ.. కాంగ్రెస్ పార్టీతో కదలి వస్తామంటున్న ఇతర పార్టీల నాయకులు_

 TGW NEWS/ మానకొండూర్:

 ఆశీర్వదించి అసెంబ్లీకి పంపుతామంటున్న ఆడబిడ్డలు

స్థానికేతరుడిని తరిమికొడుదాం మానకొండూర్ నియోజకవర్గాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చిన కవ్వంపల్లి

పల్లె పల్లెకు కవ్వంపల్లి - గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామంలో పాదయాత్ర చేసిన కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారు.

కార్యక్రమంలో రాజాపూర్ ఉపసర్పంచ్ కుర్ర ఓదెలు,కంటెస్టెడ్ సర్పంచ్ రాంరెడ్డి, వార్డ్ సభ్యులు సమ్మయ్య, బిఅర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షులు ఎల్లయ్య, మాజీ సింగల్ విండో డైరెక్టర్ సదయ్య తో పాటు 100 మంది యువకులు మహిళలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు 

ఈ సంధర్బంగా కవ్వంపల్లి గారు మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల, దళిత ప్రజలకు ఇంటి నిర్మాణానికి స్థలంలో పాటు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు అందిస్తాం..

మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు ప్రయాణం..

రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణ మాఫీ..

 రూ. 500/- లకే వంట గ్యాస్..

ఈరోజు రాజాపూర్ గ్రామంలో పాదయాత్ర చేస్తూ ప్రతీ గడపకు వెళ్లి వారి  సమస్యలు తెలుసుకొని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు రాకుండా ఉంటాయని మరియు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలందరికీ అండగా నిలిచి గొప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. 

ఈ BRS ప్రభుత్వం మరియు బీజేపీ ప్రభుత్వాలు గ్యాస్, పెట్రోల్, డీజిల్ మరియు నిత్యవసర ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుంది అని ఈ సంధర్బంగా పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments