విద్యార్థుల సమస్యల నిరంతర పోరాటం, NSUI నాయకులు...
TGW NEWS/శనార్తి తెలంగాణ: చిలుకూరు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ , సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గుండాల నవీన్ యాదవ్ ఆదేశాల మేరకు చిలుకూరు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన NSUI నాయకులు,
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన NSUI చిలుకూరు మండల ఇంఛార్జి మనికంట.ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కనీస మాలిక సదుపాయాలు కల్పించి వారికి నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులకు పౌష్ఠికఆహారాన్ని అందించాలని వారు విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, విద్యార్థుల సమస్యల పట్ల NSUI నిరంతరం పోరాటం చేస్తుందని నాయకులు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో NSUI నాయకులు నూకపంగు సాయి, ఉలవలపూడి అశోక్, ముదిగొండ వినయ్, వంగూరి రవి, తదితరులు పాల్గొన్నారు

0 Comments