అయోధ్య శ్రీరామ చంద్రుని చిత్ర పటాల వితరణ కార్యక్రమం ప్రారంభం...
TGWNEWS/అయోధ్య: శ్రీరామ చంద్ర ప్రభు" ప్రాణా ప్రతిష్ట పూర్తి అయిన సందర్భంగా "బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ శ్రీ.బండి సంజయ్ కుమార్ గారు" ప్రతి కుటుంబానికి ఆ శ్రీరామ చంద్రుని చిత్ర పటం అందజేయాలని సంకల్పించడంతో "బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు" ఆధ్వర్యంలో ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలోని 6వ వార్డులోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వార్డులోని ప్రతి కుటుంబానికి శ్రీ రాముడి చిత్ర పటాలను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు, మహేష్ గారు హాజరై, చిత్ర పటాల వితరణ కార్యక్రమంలో పాల్గొని, శ్రీరాముడి విశిష్టతను రామ భక్తులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ లక్కిరెడ్డి తిరుమల,పట్టణ కోఆర్డినేటర్, జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవ రెడ్డి, గుజ్జ శ్రీనివాస్ రావు, జిల్లా కోశాధికారి, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి రామంచ మహేందర్ రెడ్డి, అసెంబ్లీ కో కన్వీనర్ వేణు గోపాల్ రావు, అక్కన్నపేట మండల అధ్యక్షుడు గోళ్లపల్లి వీరాచారి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తోట స్వరూప, బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య, ఉపాధ్యక్షులు గాదాసు రాంప్రసాద్, బోగా మహేష్కర్, తగరం లక్ష్మణ్, కోశాధికారి అకోజు అరుణ్ కుమార్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు బత్తుల కుమారస్వామి, వార్డ్ ఇంచార్జీలు కోమటి సత్యనారాయణ, నారోజు నరేష్, బోడిగే వెంకటేష్, వడ్డేపల్లి లక్ష్మయ్య, మల్లం ప్రశాంత్, ఎర్రబెల్లి ప్రశాంత్, బూత్ అధ్యక్షులు పెందోట భూశంకరాచారీ, ఎర్రబెల్లి వినోద్, భూక్యా నవీన్ నాయక్, బీజేపీ నాయకులు ఎర్రోజు సాయికృష్ణ, వొద్ధుల అశోక్, చిలుపూరి రాజేష్ , బీజేపీ నాయకులు, రామ భక్తులు పాల్గొన్నారు

0 Comments