ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి....

 TGWNEWS : రైతు సంక్షేమమే లక్ష్యంగా, రైతును రాజును చేయడమే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు అన్నారు. నందనం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నందనం, రాంనగర్, రెడ్దిపాలెం గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ గారు దేశానికే ఆదర్శనంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతు బందు, రైతు భీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన దాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. గ్రేడ్-ఎ క్వింటాలు 2, 060, సాధారణ రకం గ్రేడ్-బి క్వింటాలు 2, 040 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. దళారులను ఆశ్రయించి మోసపోకుండా సహకార సంఘాల్లో నిర్వహించే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ దాన్యాన్ని విక్రయించాలని కోరారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ మార్నెని రవీందర్ రావు, జడ్పి వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, నందనం సొసైటి వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్ రావు, సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు లో, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments