డిగ్రీ కాలేజీకి స్థల కేటాయింపు : చల్లా ధర్మారెడ్డి గారికి కృతజ్ఞతలు...
TGWNEWS : పరకాల పట్టణంలోని డిగ్రీ కళాశాలకు ప్రభుత్వం స్థల కేటాయింపు ఉత్తర్వురులు జారీచేసింది.డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించడానికి అన్ని విధాలుగా కృషి చేసినటువంటి పరకాల శాసన సభ్యులు ధర్మారెడ్డి గారికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్, డిగ్రీ కళాశాల ఒకే చోట ఉండడంతో విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారని కళాశాల సందర్శనలో గమనించిన స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు డిగ్రీ కాలేజీకి స్థలం, పక్కా భవనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాల ఆవరణలోనే డిగ్రీ కళాశాలకు 2 ఎకరాల 7 స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం కేసీఆర్ చొరవతో త్వరలోనే పక్క భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసుకోబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.


0 Comments