కానిస్టేబుళ్ళ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి : పోలీస్ కమీషనర్ ఏ.వి. రంగనాథ్.
TGWNEWS/వరంగల్ :ఈ
నెల 30వ తేది ఆదివారం రోజున పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్టెఫండరీ
క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ళ అభ్యర్థులకు జరుగనున్న రాత పరీక్షకు
ఏర్పాట్లు పూర్తయ్యాయని, రాత పరీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు
చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమీషనర్
తెలిపారు.అభ్యర్థుల రాత
పరీక్ష కోసం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో మొత్తం 16 పరీక్షాకేంద్రాలను
ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఒక్కరోజే నిర్వహింబడే ఈ రాత పరీక్ష ఉదయం 10
గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు, కొనసాగుతుందని తెలిపారు. ఈ పరీక్షకు
12,040 మంది అభ్యర్థులు హజరవుతున్నారని ఈ పరీక్షకు హజరయ్యే అభ్యర్థులు ఈ
క్రింది సూచనలను పాటించాలని సిపి తెలిపారు.


0 Comments