ఘనంగా పూలే, అంబేద్కర్ జన జాతర..

 ఘనంగా పూలే, అంబేద్కర్ జన జాతర..

TGWNEWS/హన్మకొండ:  మహాత్మా జ్యోతిరావు పూలే, డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంగం( KVPS) ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జన జాతర కార్యక్రమం పబ్లిక్ గార్డెన్స్ లోని నెరేళ్ల వేణుమాధవ్ ప్రాంగణంలో శుక్రవారం కేవీపీఎస్ హన్మకొండ జిల్లా కార్యదర్శి మంద సంపత్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిలుగా ప్రో. ఏ సీతారాం నాయక్ ex ఎమ్మెల్యే , కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలబ్ బాబు గారు, ప్రముఖ అంబేద్కర్ వాది జె.బి రాములు గార్లు హాజరై మాట్లాడుతూ మన దేశంలో మైనార్టీ గా ఉన్న శూద్రులు, అస్పృషులు, మహిళలకు చదువు నేర్పించి నాగరికులుగా తీర్చిదిద్దిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే భారత రాజ్యాంగానిర్మాత, రిజర్వేషన్ల ప్రదాత, కుల రహిత సమాజం కోసం తన తుదిశ్వాస వరకు కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ వారి జయంతులను పురస్కరించుకుని వారి ఆశయ సాధనకు సామాజిక సంఘాలను కలుపుకొని ఈ జన జాతర కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్పవిషయం అన్నారు. అలాగే ఆర్ ఎస్ ఎస్ కనుసన్నల్లో బీజేపీ ప్రభుత్వం మన రాజ్యాంగాన్ని రద్దు చేసి మూడువేల సంవత్సరాల క్రితం నాటి మనుస్కృతిని భారత రాజ్యాంగంగా ప్రవేశ పెట్టడం కోసం చూస్తుందన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ఏ మాత్రం సంబంధం లేని, జాతీయజెండా వ్యతిరేకించి, భారత రాజ్యాంగం ఈ దేశానికి పనికిరానిదాని ప్రకటించిన ఆరెస్సెస్ బీజేపీ దేశభక్తి ఫోజు పెడుతుందన్నారు. కాబట్టి బీజేపీ వల్ల రాజ్యాంగానికి ప్రమాదం పొంచిఉందన్నారు. దానికోసం ఈ ఆరెస్సెస్ బీజేపీ కి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థ లను ప్రయివేట్ పరం చేయడం, దళిత, గిరిజన బలహీన వర్గాల రిజర్వేషన్లు గండి కొడుతుందన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో 300శాతం దాడులు, దౌర్జన్యాలు పెరిగాయన్నారు. నూతన విద్య విధానం ముసుగు ధరించి పక్క మనువాదా విద్య విడనాన్నిఅమలు చేస్తున్నదని అన్నారు. దీనితో అణగారిన పేదలకు ఉన్నత విద్యను దూరం చేస్తుందని మండి పడ్డారు. అలాగే గిరిజనులకు 5,6 షెడ్యూలు లో పొందుపరిచిన హక్కులను రద్దు చేయడమే కాకుండా అడవి సంపదను అంబానీ, ఆదానిలకు కట్టబెట్టి గిరిజనులను అడవి నుంచి గెంటేసే కుట్రలు చేస్తుందన్నారు. కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, బిసి ల కుల గణన కోసం సామాజిక న్యాయం కోసం మత సామరస్యం కోసం ప్రభుత్వ రంగ సంస్థ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ మనువాదా విధానాలను మట్టుబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల అధ్యక్ష, కార్యదర్శులు బొట్ల చక్రపాణి, వంకుడొతు వీరన్న, గొడుగు వెంకట్, కంచర్ల కుమరస్వామి, ఎండి అలీ, జంపాల రమేష్, జయశ్రీ, నోముల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments