9 నెలల పసిపాప, యువకుడి మరణంపై ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి విచారం...

9 నెలల పసిపాప, యువకుడి మరణంపై  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి విచారం...

 TGWNEWS/మెదక్ :  పాపన్నపేట్ మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బీఆరెస్ పార్టీ నాయకుడు దుర్గాగౌడ్ తన కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుండి మెదక్ వస్తుండగా మెదక్ జిల్లా కొల్చారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు ఆర్టీసీ బస్ తో ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దుర్గాగౌడ్ సోదరుడు రాజుగౌడ్, కుమార్తె 9 నెలల పసిపాప సంఘటన స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న దుర్గా గౌడ్, అతని భార్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన దుర్గాగౌడ్ కొడుకు, తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బీఆరెస్ నాయకుడు దుర్గా గౌడ్  సోదరుడు రాజు గౌడ్, కుమార్తె మృతి చెందడంపై ఆ కుటుంబానికి ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన దుర్గాగౌడ్, అతని భార్య కు సంబంధించిన మెరుగైన చికిత్సకై హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. ఈ ప్రమాదం తన మనసును కలిచివేసిందని, చికిత్స విషయంలో ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ఎమ్మెల్సీ తెలిపారు.

Post a Comment

0 Comments