అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత...

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప పట్టివేత...

TGWNEWS/మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను ఫారెస్ట్ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు . గుండం -నర్సంపేట మార్గంలో రాత్రి ఎఫ్ఎస్ఓ పద్మారావు ఆధ్వర్యం లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్రమంగా ఆటోలో తరలిస్తున్న వాహనాన్ని చాకచక్యం గా పట్టుకున్నట్లు కొత్తగూడ ఎఫ్ ఆర్ ఓ వజాహత్ తెలిపారు. ఈ  పెట్రోలింగ్ లో పాల్గొన్న ఎఫ్ఎస్ఓ పద్మారావు,బీట్ ఆఫిసర్ రాంబాబు ,లావన్ కుమార్ ,వీర్ సింగ్ లను ఎఫ్ ఆర్ ఓ వజాహత్ అభినందించారు.

Post a Comment

0 Comments