తెలంగాణ భరోసా సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
TGWNEWS/నల్గొండ : మే 7 న జరగబోయే తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మే 7వ తేదీన జరగబోయే తెలంగాణ భరోసా సభ వాల్ పోస్టర్లను బుధవారం నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ మే 7వ తేదీన జరగబోయే తెలంగాణ భరోసా సభకి ముఖ్యఅతిథిగా బహుజనుల ఆశాజ్యోతి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ముఖ్యఅతిథిగా వస్తున్న సందర్భంగా బహుజనులందరూ ఏకమై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కావున బహుజనులంతా ఈ సభను కుటుంబంలో జరుగుతున్న పండుగల భావించి తండోపతండాలుగా తరలివచ్చి అక్క మాయావతి కి ఘన స్వాగతం పలకాలని బహుజనులకు మనవి చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


0 Comments