ఘనంగా TGW NEWS రాష్ట్ర కార్యాలయం ప్రారంభం...
TGWNEWS/వరంగల్ : వరంగల్ లో ఏర్పాటు చేసిన TGW న్యూస్ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నిడిగొండ అజయ్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ గండ్రాతి దిలీప్, స్టాఫ్ రిపోర్టర్ రాకేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయడంలో మీడియాది కీలకపాత్ర అని అన్నారు. ఈ సందర్బంగా సంస్థ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ రిపోర్టర్లు కప్పల అనిల్ కిషోర్, సాయి, కనుకుంట్ల శ్రీనివాస్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.


0 Comments