దారుణం : ముగ్గురు అమ్మాయిలపై రోజుల తరబడి అత్యాచారం..
TGWNEWS/గుంటూరు : పూజల ద్వారా డబ్బు వస్తుందని ముగ్గురు అమ్మాయిలతో నగ్న పూజలు చేయించారు దుర్మార్గులు. వివరాలలోకి వెళ్తే గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామంలోని జెండా చెట్టు సమీపంలోని నకిలీ పూజారితో విజయవాడ,గుంటూరు, పొన్నెకల్లు,ఒంగోలులలోని లాడ్జిల్లో పూజలు నిర్వహించారు. చిలకలూరిపేటకు చెందిన మహిళకు సోషల్ మీడియాలో పొన్నెకల్లుకు చెందిన నకిలీ పూజారి పరిచయమయ్యాడు. అనతికాలంలోనే అధికంగా డబ్బును సంపాదించాలనే దురుద్దేశంతో అమ్మాయిలు ,మహిళను కోరాడు. దీంతో నకిలీ పూజారినీ రంగంలోకి దించిన మహిళ, గతకొన్ని రోజులుగా పూజలపేరుతో అమ్మాయిలపై అత్యాచారం చేయించడం మొదలుపెట్టింది. గుంటూరు,విజయవాడ, ఒంగోలులోని లాడ్జిలో అమ్మాయిలను నగ్నంగా కూర్చోబెట్టి పూజలు నిర్వహించారు. పోన్నేకల్లులో కూడా ఓ రహస్య ప్రదేశంలో అమ్మాయిలను నగ్నంగా కూర్చోబెట్టి పూజలు చేసిన అనంతరం ముగ్గురి అమ్మాయిలను శారీరకంగా అనుభవించాడు ఆ నకిలీ పూజారి. పూజల మధ్యలో లేస్తే వచ్చే లక్షల రూపాయలు రాకుండా పోతాయని అమ్మాయిలను నిలువునా మోసం చేసాడు. ముగ్గురమ్మాయిలది కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంత వాసులుగా గుర్తించారు. వచ్చే డబ్బులో వాటాకోసం మరో ముగ్గురు యువకులు సైతం వినూత్న ప్రయత్నం చేసారు. వీరు కూడా అదే ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన అమ్మాయిలు దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా వ్యవహారం బెడిసి కొట్టడంతో అమ్మాయిలను అమరావతి రోడ్డులోనీ హోసన్నా మందిరం సమీపంలో వదిలి వెళ్ళాడు నకిలీ పూజారి. రంగంలోకి దిగిన నల్లపాడు పోలీసులు బాధిత అమ్మాయిలను స్టేషన్ కు తరలించారు. ముగ్గురు అమ్మాయిలతో పాటు మరో ముగ్గురు యువకులు, చిలకలూరపేట కు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ నకిలీ పూజారి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.


0 Comments