మృతుల కుటుంబాలను పరామర్శించిన మురళీ నాయక్..

మృతుల కుటుంబాలను పరామర్శించిన మురళీ నాయక్..

TGWNEWS/గూడూరు : మండలంలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులను మహబూబాబాద్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ మురళి నాయక్ పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. శుక్రవారం గోవిందపురం, అప్పరాజపల్లి, గుండెంగ, గూడూరు గ్రామాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమేష్ చందర్ రెడ్డి, చిట్టే వెంకన్న, అర్రేం వీరస్వామి, శివ, లక్ష్మయ్య, రవి, రమేష్, భోజ్య మహేందర్, కృష్ణారెడ్డి, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments