కొత్త ఇల్లు కట్టుకుంటే రూ.3,00,000.. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక..
TGWNEWS : గృహలక్ష్మి పథకంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పథకం కొనసాగుతుందని, నియోజకవర్గానికి 3వేల మంది చొప్పున లబ్దిదారులకు ఈ స్కీంను వర్తింపజేయాలని ఆదేశించారు. బేస్మెంట్ దశలో రూ. లక్ష, స్లాబ్ దశలో రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యాక మరో రూ.లక్ష, మొత్తం రూ. 3లక్షలను ఇవ్వాలని సూచించారు. ఆయా దశల ఫొటోలు, తదితర మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని, పనులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ తెలిపారు.


0 Comments