ఈ రహదారి మాకొద్దు : రైతుల ఆందోళన..
TGWNEWS/జగిత్యాల: జగిత్యాల జిల్లాలో చేపట్టనున్న 63వ నంబరు జాతీయ రహదారి విస్తరణపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తం అవు తోంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా నిజామాబాద్ జిల్లా పెర్కిట్ నుంచి మోర్తాడ్, కమ్మరిపల్లి, జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి శివారు, రాయపట్నం మీదుగా మంచిర్యాల జిల్లా లక్షెటిపేట, మంచిర్యాల వరకు ప్రస్తుతం గల జాతీయ రహ దారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించడానికి నిర్ణయించింది. ఇందుకు రూ. 2,581 కోట్లు నిధులు అవసరమన్న ప్రాథమిక అంచనా వేశారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారీ సర్వే, భూసేకరణ పనులు నిర్వహిస్తున్నారు. ఇందుకు అయ్యే భూసేకరణ విష యంలో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. రహదారి నిర్మాణంలో మార్పును వ్యతిరేకిస్తూ బాధితులు రోడ్డు ఎక్కుతున్నారు. కొత్త ప్రతిపాదనతో తమ బతుకులు రోడ్డు పాలు చేస్తున్నారని భూములు, విలువైన కోల్పోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి విస్తరణ తమకు వద్దంటూ నినదిస్తున్నారు. మూడేళ్ల క్రితం తయారు చేసిన అలైన్‌మెంట్ ప్రకారం కాకుండా కొత్తగా మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణాల పరిధిలో బైపాస్ రహదారి నిర్మించడానికి మార్పులు చేసినట్లు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 69.300 కిలో మీటర్ల విస్తరణ నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి జగిత్యాల, మంచిర్యాల మీదుగా మ హారాష్ట్రలోని సిరొంచ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్ధల్‌పూర్ వరకు 63వ నంబరు జాతీయ రహదారి ఉంది. 2017 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా పెర్కిట్ నుంచి మంచిర్యాల వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని తల పెట్టినప్పటికీ పలు కారణాల వల్ల పక్కనపెట్టారు. తాజాగా ఈ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొద్దిపాటి మార్పులతో పనులు ప్రారంభించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెర్కిట్ నుంచి మం చిర్యాల వరకు 131.013 కిలోమీటర్ల దూరం ప్రస్తుతం ఉన్న జాతీయ రహ దారిని ఫోర్‌లైన్స్‌గా విస్తరించాలని నిర్ణయించారు. ఇందులో నిజామాబాద్ జిల్లాలో 25.900 కిలో మీటర్లు, జగిత్యాల జిల్లాలో 69.300 కిలో మీటర్లు, మంచిర్యాల జిల్లాలో 35.813 కిలో మీటర్ల పొడవున నాలుగు వరుసల రహ దారి నిర్మించాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్ ప్రాంతంలో గల 44వ నంబరు జాతీయ రహదారి నుంచి మోర్తాడ్, కమ్మరిపల్లి, జగిత్యా ల జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రాయపట్నం బ్రిడ్జి మీ దుగా మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్, క్యాతన్‌పల్లి వరకు నాలుగు రహదారు ల విస్తరణ జరుపనున్నారు. ప్రస్తుతం భూసేకరణకు అధికారులు నోటిఫికే షన్ జారీ చేశారు. మెట్‌పల్లి, కోరుట్ల డివిజన్లలో ఏడు అభ్యంతరాలు ఇ ప్పటికే వచ్చినట్లు అధికారులు వివరిస్తున్నారు.
ఆందోళనలో అన్నదాతలు..
జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల పట్టణ ప్రాంతాల్లో గ్రీ న్‌ఫీల్డ్ హైవేను పూర్తిగా వ్యవసాయ స్థలాల మీదుగా నిర్మించేలా అలైన్ మెంట్ మార్పు చేయడానికి అన్నదాతలు వ్యతిరేకిస్తున్నారు. ఆర్మూర్ నుంచి మంచిర్యాల మధ్య జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపు రి పట్టణాలున్నాయి. ఇప్పటికే ఉన్న రోడ్డు మీదుగా ఫోర్‌లైన్ నిర్మిస్తే ఈ పట్టణాలతో పాటు అనేక అనుబంధ గ్రామాల్లో జనవాసాలకు భారీగా నష్టం జరుగుతుంది. భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపులకు పెద్ద మొత్తం లో వెచ్చించాల్సి వస్తుంది. దీంతో జనవాసాలకు నష్టం జరగకుండా, బడ్జెట్ ను తగ్గించేలా పట్టణ ప్రాంతాల్లో బైపాస్ రహదారి (గ్రీన్ ఫీల్డ్ హైవే) ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పూర్తిగా వ్యవసాయ భూముల్ల్లోంచి నాలుగు వరసల రహదారి నిర్మాణం జరగనుండడంతో గ్రీన్ హైవేగా పేర్కొంటున్నారు. జిల్లాలోని మేడిపల్లి, బండలింగాపూర్, వెల్లుల్ల, చౌలమద్ది, పెద్దాపూర్, ఎకిన్‌పూర్, సంగెం, వెంకటాపూర్, గుమ్లాపూర్, మోహన్‌రావుపేట తోపాటు జగిత్యాల డివిజన్‌లోని పలు గ్రామాల రైతులు తమ భూములు కోల్పో వలసి వస్తోందని ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే మెట్‌పల్లి, కోరుట్లలో ర్యాలీలు, ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో ఎస్సారె స్పీ కాకతీయ కాలువ నిర్మాణం, వరద కాలువ నిర్మాణం, నిజామాబాద్- కరీంనగర్ రైల్వే లైన్ నిర్మాణం కోసం తమ భూములు కోల్పోయామని, ప్రస్తుతం మరోమారు జాతీయ రహదారి విస్తరణ పేరిట బైపాస్ రహదారి ని ర్మాణానికి భూసేకరణ చేపడితే తమ కుటుంబాలు జీవనాధారం కోల్పోతా యని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు కోల్పోకుండా రహదారి నిర్మాణ అలైన్‌మెంట్ మార్పు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


0 Comments