కొట్లాడి తెచ్చుకున్నబంగారు తెలంగాణలో బ్రతుకులు మారాయా..?
TGWNEWS /హైదరాబాద్:ఆంధ్ర వాళ్ళ దోపిడీ కి గురి అవుతున్నము అంటూ ఆవేదన వెళ్ళగక్కి, సకల జనులను ఏకం చేసి, ఢిల్లీ పెద్దలు మెడలు వంచి కొట్లాడితే తెచ్చుకున్న తెలంగాణ రాష్టం,నీళ్లు, నిధులు, నియామకాల అనే మూడు ముఖ్యమైన ఎజెండాతో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనుకున్న లక్ష్యాన్ని సాధించి నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు. మరి ప్రజలు అనుకున్నట్లుగా మార్పు వచ్చిందా ? బ్రతుకులు మారాయా..? తొమ్మిదేళ్లకు ముందు తెలంగాణ ప్రజలకు తినడానికి తిండి లేక , త్రాగడానికి నీరు లేక, ఆంధ్ర పాలకుల హయాంలో నియామకాలు కేవలం ఆంధ్ర వారికే కనీసం తెలంగాణ లో ప్రభుత్వం ఉద్యోగస్తులు లేక అతలాకుతలం అవుతున్నట్లు,కేవలం కేసీఆర్ పోరాడి తెచ్చిన బంగారు తెలంగాణ వచ్చిన తర్వాతనే, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతనే అవి లభిస్తున్నాయన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు అతిగా ప్రచారం చేస్తున్నారు అంటూ సామాజిక విప్లవ కారులు, అప్పట్లో రాష్టం కోసం పోరాడిన ఉద్యమకారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు,కానీ పూర్తిగా అవాస్తవం అని చెప్పలేం. అయితే గడిచిన తొమ్మిదేళ్లలో ఇంటింటికి తాగునీరు ఇచ్చే విషయంలో అద్భుతమైన పురోగతి మాత్రం చూపించారు కెసిఆర్ . సాగునీటి కోసం కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేశారు.మరో భారీ ప్రాజెక్ట్ అయినా పాలమూరు -రంగారెడ్డి నిర్మాణంలో ఉంది. హైదరాబాద్ దిన దిన అభివృద్ధి సాధించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు విదేశీ నగరాల లుక్ వచ్చాయి. మిషన్ భగీరథ.. కాకతీయ వంటి ప్రాజెక్టులతో ప్రజల కనీస అవసరాలు తీరాయి. ఎలా చూసినా తొమ్మిదేళ్ల కిందటితో పోలిస్తే తెలంగాణ ప్రగతిని నమోదు చేసింది అనేది కాదనలేని వాస్తవం . అయితే ఈ ప్రగతి రోజూ చూస్తున్న వారికి మామూలేగా అనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త సచివాలయం అందుబాటులోకి వచ్చింది. అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లాలలో కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. నగరం నడి బొడ్డున క్రైమ్ మ్యానిటరింగ్, కమాండ్ కంట్రోల్ చేసేందుకు వీలుగా అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రూపొందించింది కెసిఆర్ హయాంలో, సాఫ్ట్వేర్ రంగం లో, ఫార్మా రంగం లో ఉపాధి అవకాశాలూ భారీగా పెరిగాయి. తెలంగాణ పురోగతిలో వంకలు పెట్టడానికి పెద్దగా ఏమీ లేదనే చెపొచ్చు.అయితే రాజకీయంగా కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారన్న ఆరోపణ విపక్షాలు నుంచి తీవ్రంగా వస్తున్నాయి. తాను లేదా తన పార్టీ మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించాలన్న లక్ష్యంతో ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చినప్పటికీ ఇతర పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రతి పక్షం గొంతు నొక్కడం, మీడియా సంస్థ లపై ఉక్కు పాదం మోపడం, తెలంగాణ ఉద్యమం లో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలు పట్టించుకో పోవడం, తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలను తెలంగాణ వచ్చాక విస్మరించి తన కుటుంబం పాలన తో పాలన సాగిస్తున్నారు అంటూ ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.ఇది బీఆర్ఎస్‌లో అసంతృప్తికి కారణం అవడంతో పాటు ప్రజల్లోనూ వ్యతిరేక భావన బాగా పెంచింది. తెలంగాణ సాధించి అభివృద్ధి చేస్తామని బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ అభివృద్ధి పరంగా తన బాధ్యతను తెలంగాణ ప్రజలు సంతృప్తి పడేలా నిర్వహించగలిగారని చెప్పుకోవచ్చు, మరి ఇతర విషయాల్లో మాత్రం ఆయన తీరును ప్రజలు హర్షించడం కష్టం..- Home
- తెలంగాణ
- _వరంగల్
- __హన్మకొండ
- __వరంగల్
- __కాజిపేట
- __జనగామ
- __మహబూబాబాద్
- __ములుగు
- _హైదరాబాద్
- _జయశంకర్ భూపాలపల్లి
- _కరీంనగర్
- _నల్గొండ
- _మెదక్
- ఆంధ్రప్రదేశ్
- _చిత్తూరు
- _కడప
- _విజయవాడ
- _ఒంగోలు
- _కర్నూలు
- _అనంతపురం
- _కాకినాడ
- ఇండియా
- సినిమా కబుర్లు
- _టాలీవుడ్
- _హాలీవుడ్
- _కోలీవుడ్
- వైరల్
- ఉద్యోగాలు
- _ప్రైవేట్ ఉద్యోగాలు
- _ప్రభుత్వ ఉద్యోగాలు
- వాతావరణం
- _తెలంగాణ
- _ఆంధ్రప్రదేశ్
- వైరల్
- ఆరోగ్యం
- మా గురించి


0 Comments