సీపీని అడ్డుకున్న కానిస్టేబుల్ : ఎందుకో తెలిస్తే షాక్...

సీపీని అడ్డుకున్న కానిస్టేబుల్ : ఎందుకో తెలిస్తే షాక్...

TGWNEWS/హైదరాబాద్ :  హైదరాబాద్‌లో పదో తరగతి పరీక్ష జరుగుతున్న కేంద్రాలను స్వయంగా రాచకొండ కమిషనరేట్‌ బాస్ డీఎస్ చౌహాన్‌ తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఎల్బీ నగర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తనిఖీ కి వచ్చిన సీపీ చౌహాన్ ను లోపలికి వేళ్ళుతుండగా ఓ మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. ఆమె సీపీ ను అడ్డుకోవడంతో అక్కడున్న పోలీసు అధికారులంతా షాక్ కి గురైయ్యారు.కాగా ఆ కానిస్టేబుల్ సర్‌.. మీరు ఫోన్‌తో వెళ్తున్నారు ఎగ్జామ్ సెంటర్‌లోకి ఫోన్‌ అనుమతి లేదంటూ సీపీకి చెప్పడంతో చౌహాన్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం ఆమెకు మొబైల్ ఇచ్చి లోపలికి వెళ్లారు.తనిఖీ అనంతరం బయటకు వచ్చిన సీపీ చౌహాన్ ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ కల్పన ధైర్యసాహసాలు, విధి నిర్వహణ తీరును ప్రశంసించారు.

Post a Comment

0 Comments