బీజేపీలో ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లా... లేనట్లా...

బీజేపీలో ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లా...లేనట్లా..

TGWNEWS/హైదరాబాద్ : నాగర్‌కర్నూలులో బీజేపీ నిర్వహించిన నవ సంకల్ప సభకు సీనియర్ నాయకులు అందరూ హజరుకాగా ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. వీరిద్దరూ బీజేపీని వీడతారంటూ గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండగా శనివారం ఢిల్లీ అధిష్టానం పిలిచి చర్చించింది. అయినా వారిలో మార్పు రాకపోవడం గమనార్హం. దీంతో కొంతమంది ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉంటారా లేక పార్టీని వీడతారా అనే విషయంపై చర్చించుకుంటున్నారు.

Post a Comment

0 Comments