తెలుగు రాష్ట్రలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ...
TGWNEWS/హైదరాబాద్: తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం బుధవారం బలహీనపడిందని పేర్కొంది. రాగల 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఖమ్మం నల్గొండ, సూర్యపేట, కొత్తగూడెం జిల్లాల్లో.. రేపు, ఎల్లుండి అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ మోస్తరు వర్షాలు.. రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తామని తెలిపింది. గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ వేగంతో వేడి గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది


0 Comments