తెలంగాణ ఎన్నికల తేదీ ఖరారు..
TGWNEWS: ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు ,పోస్టింగులు విషయమై కేంద్ర ఎన్నికల సంగం ఆదేశించింది . ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా,మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, చ్చత్తీస్గర్, మధ్యప్రదేశ్ గడువు జనవరి 3,6,తేదీలతో ముగియనుంది. రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో ముగియనుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఈసి ఆదేశాలు జారీచేసింది.ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే అధికారులను సొంత జిల్లాలలో. ఎక్కువ కాలం పనిచేసిన ప్రాంతాలలో ఉండరాదని కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది ఒకే చోట మూడేళ్ల గడువు మించరాదని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ వీధుల్లో నేరుగా ఉండే డీఈఓలు, డిప్యూటీ, డిఈఓలు,ఆర్ఓలు ఏఆర్ఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు,నోడల్ అధికారులు, ఐజీలు, డిఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లకు,ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
మరోవైపు తెలంగాణలో త్వరలో రాబోయే శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రణాళిక చేపట్టింది. ఈ కార్యక్రమంలోని రెండోద దఫా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది, అక్టోబర్ 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టనుంది, ఆ తేదీకి 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఓటు హక్కుకు నమోదు చేసుకోవచ్చని సూచించింది, ఎన్నికల కమిషనర్ అధికార వెబ్ సైట్ www.nvsp.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.


0 Comments