భారత జాతి అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడిన ధీరుడు...

 భారత జాతి అస్తిత్వాన్ని  ఆత్మ గౌరవాన్ని  కాపాడిన ధీరుడు...

TGWNEWS/పెద్దపల్లి జిల్లా: మంథని పట్టణంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగిన రోజు, హిందూ సామ్రాజ్య దినోత్సవ సందర్బంగా విగ్రహ దాత చంద్రుపట్ల సునీల్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలో వారి విగ్రహనికి పూల మాలలు వేశారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ. భారత దేశాన్ని ఆక్రమించాలని   శతవిధాలుగా ప్రయత్నించిన మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన  వీరుడు చత్రపతి శివాజీ, భారతజాతి  అస్తిత్వాన్ని, ఆత్మగౌరవానికి ,  హిందూ సామ్రాజ్యాన్ని కాపాడిన దీశాలి , గొరిల్లా యుద్ధాన్ని అనుసరిస్తూ అనేక సంస్థానాలను జయించిన వీరుడు, కులమత వర్ణ  లింగ బేధాలు లేకుండా  సమ సమాజ స్థాపనకు ఎంతగానో కృషి చేశాడు, ఆనాడు చత్రపతి శివాజీ అనుసరించిన  మండళీకరణ  పాలనే నేటి మండల వ్యవస్థ, ఈరోజు హిందూ సమాజం, దేవాలయాలు ఉన్నాయంటే అది చత్రపతి శివాజీ గారి పోరాటం వల్లే  అన్నారు ఈకార్యక్రమంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపణ కమిటీ కన్వీనర్ సదశివ్, చిలువేరి సతీష్, నాంపల్లి రమేష్,  సబ్బాని సంతోష్,కొండపాక సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్,  బోయిని నారాయణ, పోతారవేని క్రాంతికుమార్, కోరబోయిన మల్లిక్,చీదురాల మధుకర్ రెడ్డి, ఎడ్ల సాగర్, కాసర్ల సూర్య, బుర్ర రాజు, బొల్లం పల్లి లక్ష్మణ్,పార్వతి విష్ణు, కాటం శ్రీధర్ ,పాల్గొన్నారు. 

Post a Comment

0 Comments