ఒక భార్య..20 మంది భర్తలు పెళ్లాడి పరారయ్యే దొంగ పెళ్లాం...TGWNEWS/జాతీయం:భార్య కనిపించడం లేదంటూ కశ్మీర్‌లోని బడగాం పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అనంతరం మరో డజను మంది కూడా అలాంటి కంప్లయింట్లే ఇచ్చారు.వారు సమర్పించిన ఫొటోలను చూసి ఆశ్యర్యపోవడం పోలీసుల వంతయింది. ఎందుకంటే వారందరు ఇచ్చిన ఫొటో ఒక్క మహిళదే.ఒకరికి తెలియకుండా మరొకర్ని వివాహం చేసుకొని పరారయ్యే . కనీసం 20 మందిని ఇలా పెళ్లి చేసుకొని నగదు, నగలతో ఉడాయించినట్టు పోలీసుల విచారణలో తేలింది.పెళ్లి సంబంధాలు చూసే ఓ మధ్యవర్తి సాయంతో ఆమె ఈ నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. పెళ్లి చేసుకోవడం, వరుడి ఇంట్లో ఉన్న డబ్బు, నగలతో పరారవడం ఆమె నైజం అని పోలీసులు చెప్పారు.బడగాంకు చెందిన మహమ్మద్ అల్తాఫ్ కూడా.. తాను ఆ మహిళను పెళ్లి చేసుకున్నప్పుడు అసలు పేరు చెప్పలేదని పేర్కొన్నాడు. సదరు మహిళ ఇంట్లోని వస్తువులను తీసుకొని రాత్రి వేళ ఉడాయించిందని వాపోయాడు....
0 Comments