18 గ్రామాల సంపూర్ణ సమ్మె...
TGWNEWS/హుజురాబాద్ :మ్మార్పీఎస్ దేవునూరి రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో సమ్మెకు మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి మాదిగ సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల పెంపు మరియు పర్మనెంట్ కోసం నేటికీ 12 వ రోజులు గడుస్తున్నా కానీ. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సోచనియం అన్నారు. హుజురాబాద్ మండల పరిధిలోని 18 గ్రామాల పంచాయతీ కార్మికులు సంపూర్ణంగా సమ్మె చేస్తున్నారు. పారిశుధ్యం పనులు పక్కుకు పోయేస్తితికి ప్రభుత్వం తీసుకు వచ్చింది.కార్మికులు అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్నప్పటికీ న్యాయం చేయలేదు.ఈ సమ్మె డిమాండ్స్ పరిష్కరించాలి.ఉద్యోగ భద్రత లేకుండా,వేతనాలు ప్రతి నెల చెల్లించకుండా, రెండు మూడు నెలలు పెండింగ్ పెడుతూ ఒకపక్క మండల అధికారులు, గ్రామ సర్పంచులు,కార్యదర్శుల వేధింపులు ఎక్కువవుతున్నాయని జీతాలు ఇవ్వాలని అడిగిన కార్మికులను పనులను తొలగిస్తున్నారని,కార్మికుల ఉద్యోగ భద్రత, జీవో నెంబర్ 60 ప్రకారం 30% పిఆర్సి పేంపు అమలు చేయాలని, పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదవశాస్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 5 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం,PF,ESI అందించాలని,మల్టీపర్పస్ 51 జీవోను సవరించి, కేటగిర్ల వారిగనే పనులు కొనసాగించాలని, కారోబార్లను పంచాయతీ సహాయ కార్యదర్శి లుగా నియమించాలని తదితర డిమాండ్ల లో సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్లారు అని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రుద్రారపు రాంచంద్రం మాదిగ రేణుకుంట్ల సాగర్ మాదిగ తునికి వసంత్ మాదిగ అకెనపెల్లి సమ్మయ్య మాదిగ వీరితోపాటు గ్రామాల కార్మికులు మరియు తదితరులు పాల్గొన్నారు....

0 Comments