తెగిన వీణవంక చెరువు కట్ట 6 గ్రామాలకు పోటెత్తిన వరద నీరు...


 తెగిన వీణవంక చెరువు కట్ట 6 గ్రామాలకు పోటెత్తిన వరద నీరు...

 TGWNEWS/హుజురాబాద్: వీణవంక  పక్కన ఉన్న కల్వల  చెరువు కట్ట తెగి వీణవంక మండలంలో  వీణవంక గ్రామం, రెడ్డిపల్లి గ్రామం, బ్రాహ్మణపల్లి గ్రామం, రామకృష్ణాపూర్ గ్రామం, లక్ష్మక్కపల్లి గ్రామం, పోతిరెడ్డి పల్లి గ్రామం, జమ్మికుంట మండలంలో విలాసాగర్ గ్రామం ఇలా హుజురాబాద్ నియోజకవర్గం లో కొన్ని గ్రామాలలో ఈ కల్వల చెరువు ద్వారా ప్రవహించే గ్రామాలవి  ఈరోజు కరీంనగర్ కలెక్టర్ బి గోపి గారితో మరియు కరీంనగర్ సిపి సుబ్బారాయుడు గారితో కలువల చెరువు తెగిన కట్టని పరిశీలిస్తు మాట్లాడుతున్న గౌరవ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ, హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు.ఈరోజు కల్వల చెరువు వద్ద కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు,  మానకొండూరు శాసనసభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ గారు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో దీనిని కలువల ప్రాజెక్టుగా దీని డిజైన్ చేయాలని చెప్పి అధికారులతో ఎస్టిమేట్ వేయించి రానున్న రోజుల్లో బ్రహ్మాండంగా దీని డిజైనింగ్ చేసి మా ప్రాంత ప్రజలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతి రెడ్డి గారు, జడ్పిటిసి వనమాల సాధవ రెడ్డి గారు, కేశవ పట్నం జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి గారు,  కలువల సర్పంచ్ భద్రయ్య గారు,వీణవంక సర్పంచ్ నీల కుమార్ గారు, వీణవంక ఎంపిటిసి రాయిశెట్టి లతా శ్రీనివాస్ గారు అధికారులు ఆర్డీవో గారు, ఏసీపీ గారు మరియు ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ....

Post a Comment

0 Comments