బి ఆర్ ఎస్ పార్టీ ఉచిత కరెంట్ పేరుతో మోసాలు కాంగ్రెస్ నిరసన ...
TGWNEWS/తెలంగాణ : కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తూ తొమ్మిది సంత్సరకాలం లో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచిన రాష్ట్ర ప్రభుత్వ మోసాలకు నిరసనగా బుధవారం రోజున ధర్మారం మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో స్థానిక స్థానిక సబ్ స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుపుతున్న నిరసన కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దెల రవీందర్ పాల్గొని శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా బి.ఆర్.ఎస్ మండల నాయకులు అధికార బలంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం వద్దకు వచ్చి అధికార పార్టీకి అనుగుణంగా నినాదాలు చేస్తూ రసాభాస సృష్టించారు.. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేసినప్పటికీ బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ గొడవను పెద్దది చేసే ప్రయత్నం చెయ్యడంతో ధర్మారం ఎస్.ఐ రవీందర్ మాట్లాడుతూ .ఎస్సై సూచన మేరకు మద్దెల రవీందర్ పార్టీ శ్రేణులకు సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణిగింది...


0 Comments