BC కులవృత్తులకు ఆర్థిక సాయం రూ.400 కోట్లు విడుదల...
TGWNEWS/తెలంగాణ:తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కులవృత్తులు, చేతివృత్తి పనుల చేసుకునే బీసీ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలోనే పథకానికి రూ.400కోట్ల నిధులను బీసీ సంక్షేమ శాఖ ఈరోజు మంగళవారం విడుదల చేసింది. ఈ నిధులను పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు అందించనున్నారు.మరో వైపు కులవృత్తులు, చేతివృత్తులు చేసే బీసీ కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామాలవారీగా అందిన దరఖాస్తులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి, అర్హులైన వారి జాబితాలు రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సూచించింది. కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఈ బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్ అధికారులు, మండల పంచాయతీ అధికారులు దీనిపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు నిర్ణీత నమూనా పత్రాన్ని పంపగా.. కార్యదర్శులు సమాచారం సేకరిస్తున్నారు...


0 Comments