జిపి కార్మికుల డిమాండ్లను తీర్చాలని ఇనగాల నిరసన..

జిపి కార్మికుల డిమాండ్లను తీర్చాలని  ఇనగాల నిరసన..

TGWNEWS/హన్మకొండ:నడికూడ ఎంపీడీవో కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న జీపీ సిబ్బందికి ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  నిరసన ర్యాలీ పాల్గొని మద్దతు తెలిపారు..రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సిబ్బంది నిరాదరణకు గురవుతున్నారని,అందులో అత్యధికంగా బలహీన వర్గాల వారే ఉన్నారని,వారి సమస్యలను పరిష్కరించాలని టీపీసీసీ సభ్యులు,పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు చేస్తున్న సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండోవ రోజుకు చేరుకుంది.కాగా, ఈరోజు నడికూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు జిపి కార్మికులు చేస్తున్న సమ్మెకు నిరసనగా బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి వారికి మద్దతు తెలిపారు.అనంతరం ఇనగాల గారు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులను గ్రామాలను శుభ్రం చేసి అద్దంలో తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే రాష్ట్రప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా వివక్ష ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది పంచాయతీసిబ్బంది ఉన్నారని,రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 51ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.అంతేకాకుండా, కారోబార్,బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని అన్నారు.గ్రామపంచాయతీలలోని ప్రతి ఉద్యోగి,కార్మికుడికి కనీస వేతనం రూ.20వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి, జిపీ సిబ్బంది నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్ల ను  పరిష్కరించాలని   డిమాండ్ చేశారు.లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దే వేందర్ గౌడ్,మండల ప్రధానకార్యదర్శి డా.మలహాల్ రావు,నడికూడ గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ల నవీన్,మండల మహిళా అధ్యక్షురాలు బొగం కమల,మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల చిన్ని,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అప్పం కుమార్,మండల కోశాధికారి తలగంప్ప రాజు,పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పోరండ్ల వేణు,ఆలేటి రాజు,యూత్ కాంగ్రెస్ నాయకులు బాసాని సుమన్,గడ్డం శివ,తాళ్లపెల్లి యుగేందర్,జంగిలి శ్రీకాంత్,నేరెళ్ల అరుణ్,ధర్మారం గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ,పోరండ్ల సాయి తదితరులు పాల్గొన్నారు....

Post a Comment

0 Comments