ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు❓ 
TGWNEWS/జాతీయం: మీరు గమనిస్తున్నారు కదా, మే నెల 3 వతేది ఇద్దరు మణిపూర్ మహిళలను నగ్నంగా నడిపించి, అత్యాచారం చేసిన ఘోరాతిఘోరమైన సంఘటన జరిగితే, ఆ వీడియో సరిగ్గా లోకసభ సమావేశాలు మొదలుకావడానికి ముందు రోజు - అంటే జూలై 19న వైరల్ అవుతుంది.అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. 75 రోజుల తరువాత అది సరిగ్గా ఇప్పుడే ప్రచారం కావడం కేవలం యాక్సిడెంటల్ విషయమేనా? అదాని కంపెనీల్లో అవకతవకలు జరిగియని హిండెన్ బర్గ్ రిపోర్ట్ కూడా పార్లమెంటు సమావేశాలముందే బయటికొస్తుంది.గుజరాత్ లో జరిగిన మతకలహాల పై అపద్ధాలు, అర్ధ సత్యాలతో కూడిన BBC డాక్యుమెంటరీ కూడా పార్లమెంట్ సమావేశాలముందు, లేదా ఎన్నికలముందు సరిగ్గా బయటికొస్తాయి. ఎందుకు,,ఇలా ప్రశ్నిస్తే మన దేశంలో మేధావులకు, న్యాయ నిపుణులకు నచ్చదు. సరిగ్గా పార్లమెంట్ సమావేశాలముందు ఇలాంటి వివాదాలను ముందుకు తెస్తారు. ప్రతిపక్షాలు పార్లమెంటు లో ప్రభుత్వాన్ని చుట్టు ముడతాయి, స్థంబింప చేస్తాయి, కీలకమైన బిల్లులు పాస్ కాకుండా అడ్డుకొంటాయి, కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిలబడితే 'ఇండియా లో ప్రజాస్వామ్య వాదుల గొంతు నొక్కేస్తున్నారని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, ఇక్కడినుండే విదేశాలకు వినబడేలాగా కానీ , అక్కడికెళ్లి కానీ కేంద్ర ప్రభుత్వం పై బురద చల్లుతారు. ఇదంతా ఒక పక్కా పథకం జరిగిపోతాయి. నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడం అనేది ఈ పథకం యొక్క లక్ష్యం. మణిపూర్ లో కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులు, విదేశీ, స్వదేశీ చర్చిల ఆర్థిక, ఆయుధ సహాయంతో బాగా బలపడ్డారు. వీళ్ళ పద్ధతులు చాలా తెలివిగా, ఇలా కూడా చేస్తారా అనిపించేంత ఆశ్చర్యంగా వుంటాయి .ఉదాహరణకు, ఒక గ్రామంలో ఉగ్రవాదులు వున్నారని భద్రతా దళాలకు సమాచారం వస్తుంది. వీళ్ళ వాహనాలు ఆ గ్రామ శివార్ల లోకి వెళ్ళగానే, అక్కడి మహిళలు, తట్టలు , గిన్నెలు పట్టుకొచ్చి, పోలీసుల , భద్రతా దళాల వాహనాలను చుట్టుముట్టి, గరిటెలు, స్ఫూన్ లతో గట్టిగా శబ్దాలు చేస్తారు. అది విని ఉగ్రవాదులు తప్పించుకుపోతారు. పోలీసులు, సైనికులు ఆ మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు, అది ఒక్కోసారి గంటలు గంటలు పడుతుంది. ఈలోపు ఉగ్రవాదులు తప్పించుకోపోయి వుంటారు. ఒక వేళ సైనికులు, పోలీసులు ఉగ్రవాదులను పట్టుకోగలిగి వాళ్ళను జైలుకు తీసుకెళ్లుతుంటే, లేదా తీసుకెళ్లిపోయినా, అక్కడి మహిళలు అక్కడే, నడి రోడ్డు మీదనే తమ గుడ్డలు విప్పేసుకొని, నగ్నంగా మారి గొడవ చేస్తారు. ఆ పరిస్థితి లో భద్రతా దళాలు , పోలీసులు ఆ మహిళల కు దగ్గరగా వెళ్ళలేరు, చేతులతో వాళ్ళను నెట్టే ప్రయత్నం చేస్తే, ఆ దృశ్యాలను మరోరకంగా చూపించే ప్రయత్నం చేస్తారు. అతి సున్నితమైన అంశం కాబట్టి మన బలగాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహారించాల్సి వుంటుంది. అక్కడున్న చర్చి అనుకూల మీడియా ఆ దృశ్యాలను మరో విధంగా ప్రచారం చేస్తుంది. తమ వాళ్ళను వదలకపోతే అక్కడే నగ్నదేహాలతో చనిపోతామని, లేదా అక్కడినుండి కదలమని గొడవ చేస్తారు. ఈ మధ్య అలా చేసి ఈ మహిళలు 16 మంది ఉగ్రవాదులను విడిపించుకుపోయారు. పరిస్థితి ఎలా వుందో మీరు వూహించవచ్చు. మరో వైపు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ కూడా ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి.మే 3 న ఆ ఘోరం జరిగితే , ఆ రాక్షసులను పట్టుకోవడానికి ఇంత సమయం పట్టిందా? ఆయన్ని కేంద్రం తప్పించడమే మంచిది. ఒకవైపు ఉగ్రవాదుల ఏరివేత , మరో వైపు మణిపూర్ ప్రజల మనోభావాలను గౌరవించడం, తిరిగి సామాన్య పరిస్థితులు నెలకొల్పడం అనేవి కేంద్రం ముందున్న అతి క్లిష్ట మైన సవాళ్లు. చివరగా ఒక సందేహం : పశ్చిమబెంగాల్ లో ఇలాంటి సంఘటన లు పదుల సంఖ్యలో జరిగాయి , రాజస్థాన్ , ఛత్తిస్ ఘడ్ లో కూడా జరిగాయి. కానీ సుప్రీంకోర్టు ఎందుకు మణిపూర్ విషయంలో మాత్రమే ఇంత త్వరగా , ఘాటుగా స్పందించింది ?

0 Comments