పేదల అభివృద్ధి,సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం...
TGW NEWS/వరంగల్: పరకాల మండలం.దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపింది కాంగ్రెస్స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు...బిఆర్ఎస్ అవినీతి పాలన, హామీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం...ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించిన ఇనగాలమాచ్చపూర్ గ్రామం బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి 20కుటుంబాలు చేరికలు..ఉకల్ H.P బంక్ కర్ణాకర్ హోటల్ దగ్గర గీసుగొండ మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా....పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గౌరవ శ్రీ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పాల్గొన్నారు మొదటిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించి రొండు నిముషాలు మౌనం పాటించారు..ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మ రెడ్డి మీ ఎన్నికలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?రేకుల ఇండ్లు, గుడిసే ఇండ్లు తీసేసి పేదలకు డబల్ బెడ్ రూంలు ఇస్తా అన్న మాట గత నాలుగున్నర సంవత్సరాల నుండి ఎమ్మెల్యే గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి కెసిఆర్ పరకాల నియోజకవర్గం లో పెద ప్రజలను అతి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న పెదలను మోసం చేసారు....మీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి యువకుల దగ్గర ఓట్లు దండుకొని ఇంత వరకు కెసిఆర్ గాని స్థానిక ఎమ్మెల్యే గారి నిరుద్యోగ భృతి ఇవ్వకుండ యువకులను మోసం చేసారు,యువకులరా మేధావులారా మేలుకొని స్థానిక ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పండి..దళిత బంధు వస్తే డబుల్ బెడ్ రూమ్ రాదు డబుల్ బెడ్ రూమ్ వస్తే దళిత బంధు రావు అన్న ఎమ్మెల్యే ఇంత వరకు ఏవి రాకపోవడం దళితులను మోసం చేయడం ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టుగానే ఉంది..కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఉద్యోగాల భర్తీ మీద శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. రైతుల దగ్గర భూములు తక్కువ ధరక్కొని బడా కంపెనీలతో కుమ్మక్కై ఎక్కువ ధరకు అమ్ముకొని అవినీతికి గురయ్యారు అన్నారు...భూములు ఇచ్చిన రైతులకు 100 గజల భూమి,ఇంటికో ఉద్యోగం ఏమైంది అని అన్నారు,కేటీఆర్ వచ్చి మాట్లాడుతూ 15రోజులో పట్టాలు ఇస్తాం అని చెప్పి ఇంత వరకు ఇవ్వకపోవడం రైతులకు మీరు న్యాయం చేయకుండ మాటలతో మభ్యపెట్టారు అని అన్నారు...మండల పరిధిలో అక్రమ మొరం దందా గత అనేక మాసలుగా టెక్స్టైల్ పార్కుకు మరియు లేఆవుట్లకు సప్లై చేస్తూ లక్షల క్యూబిక్ మీటర్లు అమ్ముకుంటూ కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని తెలిపారు దీనిపై ఉన్నత అధికారులకు కంప్లైంట్ చేసిన ప్రతిసారి ఎమ్మెల్యేకి వత్తాసు పలుకుతున్నారు అన్నారు..గతంలో కురిసిన వర్షాలకు పంట నష్టం జరుగుతే రైతులను వద్దకు వచ్చిన కెసిఆర్ నష్ట పరిహారం ఇస్తా అన్న పది వేల రూపాయలు ఏమైంది అని అడిగారు? గ్రామాలలో పాఠశాల పరిస్థితులు చాలా అధ్వానంగా ఉంది కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఎమ్మెల్యే గారు పాఠశాలలు తిరిగి వారి సమస్యలు తెలుసుకుని అభివృద్ధి పదంలో తీసుకోవాల్సిన ఎమ్మెల్యే తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదు అన్నారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల ను వ్యతిరేకిస్తూ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం నిరంతరంగా కృషి చేయాలని అన్నారు..ఇది సరైన సమయం మంచి నిర్ణయం తీసుకోండి ప్రజలు, నిరుద్యోగులు,రైతులు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నరు.ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టె ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుంది అన్నారు. మచ్చాపూర్ గ్రామం బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 20 కుటుంబాలు చేరగా వారికి సాగరంగా ఇనగాల గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే రైతులకు ఎకకాలంలో 2లక్షల రుణమాఫీ,2లక్షల ఉద్యోగాలు,500 రూ/-గ్యాస్,నిరుద్యోగులకు 4000 రూ/-తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25వేలు పెన్షన్,ఉద్యమ కారులకు గుర్తిపు కార్డు,4000 రూ/-పెన్షన్,రైతులకు,కౌలు రైతులకు ఏడాదికి 15వేలు పెట్టుబడి సాయం,24గంటల న్యాయమైన విద్యుత్,18సంవత్సరాలు నిండిన మహిళలకు ఎలక్ట్రానిక్ స్కూటీ,5లక్షల వరకు ఉచిత వైద్యం,సొంత ఇంటి నిర్మాణం కోసం 5లక్షలు ఆర్ధిక సహాయం,భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12000రూ/-,పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందే ప్రతిష్టమైన పంట బీమా పధకం తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేస్తుంది అని అన్నారు..ఈ కార్యక్రమంలో పిసిసి కోఆర్డినేటర్ బొమ్మనపల్లి అశోక్ రెడ్డి,వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంభాడి రవీందర్,జిల్లా నాయకులు చాడ కొముర రెడ్డి,సాయిలి ప్రభాకర్,గీసుగొండ ఎంపీపీ భీమాగాణి సౌజన్య,జిల్లా ఎస్సి సెల్ వైస్ చైర్మన్ దుపాకి సంతోష్,మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్,15వ డివిజన్ అధ్యక్షులు ఎల్లగొండ ప్రవీణ్,మండల ప్రధానకార్యదర్శి అప్పని కరుణాకర్,వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాపు స్వామి,ఎంపీటీసీ గోపాల్ నాయక్,మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్,కిసాన్ సెల్ అధ్యక్షులు చెరుకుపెల్లి సాంబ రెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు వజ్ర రాజు,ఎస్సి సెల్ అధ్యక్షులు గొర్రె రాజు,ఎస్స్టి సెల్ అధ్యక్షులు బాధవత్ బాళోజి,మరియు వివిధ గ్రామాల అధ్యక్షా కార్యదర్శులు,డివిజన్ ముఖ్య నాయకులు,మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...


0 Comments