ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు... 
TGW NEWS/ పరకాల: బహుజన విప్లవ వీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి వేడుకలు హన్మకొండ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ఆధ్వర్యంలో పరకాల మండలంలో సీతారాంపురం గౌడ సంఘం శుక్రవారం రోజున నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి , నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేసి ,స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ట దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చునని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిరూపించారని అన్నారు . సర్వాయి పాపన్న త్యాగాలను, పోరాటాలను స్మరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.మూడు వందల ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి బహుజన వర్గాల కోసం పోరాటం చేసిన ధీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపాన్న గౌడ్ అని, దోపిడిదారులను అంతమొందించి దొరల పాలనకు చరమగీతం పాడిన మహాత్ముడు పాపన్న గౌడ్. ఏ ఒక్క కులానికో, వర్గానికో కాకుండా అన్ని కులాలను కలుపుకపోయి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన అధినేత అన్నారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా గౌడ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చిర్ర సారంగపాణి గౌడ్ , గౌడ సంక్షేమ సంఘం పరకాల మండల అధ్యక్షులు తండ రమేష్ గౌడ్ , మాజీ సర్పంచ్ బుర్ర రాజమౌళి, బుర్ర రామ్మూర్తి గౌడ్ , గౌడ సంఘం ఉపాధ్యక్షులు తడక వేణు , కోశాధికారి పోశాల బిక్షపతి గౌడ్ , సంఘ అధ్యక్షులు బండి శ్రీనివాస్ , సహాయక కార్యదర్శి జనగాం రాజు , గునిగంటి రామ్మూర్తి ,బొమ్మ రాజు , నేరెళ్ల రాజు , బుర్ర శ్రీనివాస్ గౌడ్. బైరి రాజు , పల్లె రాజయ్య. నేరెళ్ల రాజు. తదితరులు పాల్గొన్నారు...

0 Comments